Tarakaratna: నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన మరణ వార్త నందమూరి కుటుంబ సభ్యులను ఎంతగానో కలిచి వేస్తుంది. ఇక తారకరత్న ఫిబ్రవరి 18న మరణించడంతో ఆయన పెద్దకర్మను మార్చి రెండవ తేదీ ఫిలిం క్లబ్ కల్చర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యి తారకరత్న చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అలేఖ్య రెడ్డి తన భర్తను తలుచుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ఇక తారకరత్న పెద్దకర్మ సందర్భంగా అలేఖ్యరెడ్డి తన భర్త తనకు రాసినటువంటి ఒక లవ్ లెటర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ లవ్ లెటర్ కనుక చదివితే తారకరత్నకు అలేఖ్య అంటే ఎంత ప్రేమనో తనని ఎంతగా ప్రేమించాడో అర్థమవుతుంది. ఇక ఈ లెటర్ చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తారకరత్న అలేఖ్యకు రాసిన లవ్ లెటర్ లో ఏముందనే విషయానికి వస్తే..
ముందుగా తన భార్య అలేఖ్యకు హ్యాపీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ.. నాకు ఇతరుల పై ఉన్న ప్రేమను వ్యక్త పరచడం రాదు అంటూనే తన భార్యపై తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేశారు.ఈ లెటర్లో తారకరత్న అలేఖ్య గురించి రాస్తూ నాకున్నది నువ్వు మాత్రమే నువ్వే నా ప్రపంచం బంగారు తల్లి అంటూ అలేఖ్య పై తనకున్నటువంటి ప్రేమను తెలిపారు. ఇలా తారకరత్న రాసిన ఈ లవ్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఎమోషనల్ అవుతున్నారు. ఇక ఈ లవ్ లెటర్ ను షేర్ చేస్తూ అలేఖ్య ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా అలేఖ్య ఈ లెటర్ ని షేర్ చేస్తూ… మనం మన జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం.. ఎన్నో ఎత్తుపల్లాలను చూసాం.. వాటన్నింటినీ అధిగమించి చాలా దూరం ప్రయాణం చేసాం. ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ నమ్మకం కోల్పోకుండా మంచి రోజుల కోసం ఎదురు చూసాం… మనకంటూ ఒక చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాం. నువ్వేంటో ఎవరికీ తెలియదు నిన్ను ఎవరు అర్థం చేసుకోలేదు.. నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ మనసులోనే దాచుకొని కేవలం మాకు ప్రేమను మాత్రమే పంచావ్… మన చుట్టూ ఉన్నవాళ్లు ఎన్ని అబద్ధాలు చెప్పినా నేను వాటిని నమ్మను జీవితంలో మరింత ఎత్తుకు ఎదుగుతాను అంటూ ఈ సందర్భంగా తారకరత్న పై తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…