Movie News

Tarakaratna: నందమూరి తారకరత్న మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Tarakaratna: నందమూరి వారసుడు తారకరత్న ఇండస్ట్రీలోకి ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా అడుగు పెట్టారు. అయితే ఈయన ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఈ క్రమంలోనే తన సెకండ్ ఇన్నింగ్స్ వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సినిమా అవకాశాలను అందుకుంటు ఉన్నారు. అయితే ఈయన సినిమాలలో పెద్దగా సక్సెస్ కాకపోవడంతో రాజకీయాలలోకి రావాలని భావించారు. ఇలా పార్టీ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈయన గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా తారకరత్న మరణించడంతో నందమూరి కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక నందమూరి తారకరత్న అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి ఇంట్లో వారికి ఇష్టం లేకపోవడంతో గుడిలో వివాహం చేసుకున్నారు. ఈ కారణంగా కొంతకాలం పాటు ఈయన తన కుటుంబానికి దూరంగా ఉన్నారు. అయితే బాలకృష్ణ విషయంలో జోక్యం చేసుకొని తనని కుటుంబ సభ్యులకు దగ్గర చేశారు.

ఈ విధంగా బాలకృష్ణ తారకరత్న మధ్య ఎంతో మంచి అనుబంధముందే అయితే ఈయన గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ చివరికి ఫిబ్రవరి 18న మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా తారకరత్న మరణించడంతో ఈయనకు సంబంధించిన విషయాల గురించి పెద్ద ఎత్తున అభిమానులు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోని తారకరత్న వ్యక్తిగత విషయాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tarakaratna: భారీగా ఆస్తులు కూడ పెట్టిన తారకరత్న…

ఇక తారకరత్న హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోయినప్పటికీ ఈయనకు మాత్రం బయట బిజినెస్ లు భారీగానే ఉన్నాయని తెలుస్తోంది. నందమూరి మోహనకృష్ణ కలిపి హైదరాబాద్‌లో రామకృష్ణ థియేటర్స్‌తో పాటు తారకరత్న థియేటర్స్ ఉన్నాయి. కొన్ని హోటల్ బిజినెస్‌లున్నాయి. మరోవైపు MK ట్రేడర్స్ పేరిట వ్యాపారం కూడా ఉంది. వీళ్ల ఇళ్లు, ప్రాపర్టీస్, కమర్షియల్ కంప్లెక్స్‌లు ఉన్నట్టు సమాచారం వీటి విలువ సుమారు 1000 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇక తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి కూడా ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసే వారు ఈమె పేరు కూడా సుమారు 250 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విధంగా తారకరత్న ఆస్తులు సుమారు 1500 కోట్ల వరకు ఉంటాయని సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలియకపోతే భారీ నష్టమే!

ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…

2 minutes ago

ఒక్కసారిగా వాంతులు ఎందుకు వస్తాయి? వాతావరణ మార్పే కారణమా?

అకస్మాత్తుగా వాంతులు రావడానికి వాతావరణమే కారణం? మనలో చాలామందికి ఒక్కసారిగా కడుపులో తిప్పడం, నోటి వెంట నీళ్లు రావడం, వాంతులు…

1 hour ago

పాలకూరలో దాగిన మాజిక్ విటమిన్స్.. ఇలా తింటే అంటే అసలు ఫలితం వస్తుంది!

పాలకూర.. సూపర్ ఫుడ్, కానీ సరైన పద్ధతిలో తినాలి చవకగా దొరికే ఆకుకూరల్లో పాలకూర ప్రత్యేక స్థానం పొందింది. తెలుగులో…

1 hour ago

చిరంజీవి ‘ఖైదీ’ను హిందీలో నిర్మించిన కృష్ణ.. ఆ సినిమా ఏదో తెలుసా?

తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఒక తరం స్టార్‌గా వెలిగిన హీరో, తర్వాతి తరం మెగాస్టార్…

1 hour ago

అంతర్జాతీయ ఈవెంట్‌లో ఇది ఎదురయ్యింది”.. యాంకర్ స్రవంతి షేర్ చేసిన షాకింగ్ స్టోరీ

యాంకర్ స్రవంతి బిజీ షోస్, సోషల్ మీడియా, కానీ ఎదురైన ఆ వేడుక అనుభవం మర్చిపోలేంటి తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో…

1 hour ago

“వీక్‌నెస్‌ను స్ట్రెంగ్త్‌గా మార్చిన దూబే.. ఇప్పుడు ప్రత్యర్థులకు నిద్రలేకుండా చేస్తున్న పవర్ హిట్టర్!”

 టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు మరో మ్యాచ్ విన్నింగ్ హీరో దొరికాడు. బ్యాట్‌తో దూకుడుగా ఆడుతూ, అవసరమైన సమయంలో…

1 hour ago