టాటా గ్రూపు లోన్ తీసుకొనే వారికి టాటా సంస్థ శుభవార్తను ప్రకటించింది.ఈ క్రమంలోనే టాటా డిజిటల్ అతి త్వరలోనే ఒక సూపర్ యాప్ ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా టాటా గ్రూప్ కస్టమర్లకు ఆన్ లైన్ ద్వారా నిత్యావసర వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు విక్రయించే వెసులుబాటును కల్పిస్తోంది.
టాటా వారు ఈ విధమైనటువంటి కొత్త యాప్ అందుబాటులోకి తీసుకురావడంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పేటీఎం, రిలయన్స్ జియో మార్ట్ వంటి వాటికి ప్రత్యక్షంగానే పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోందనీ చెప్పవచ్చు. ఈ విధంగా టాటా గ్రూప్ వారు ఈ యాప్ ద్వారా ప్రజలకు నిత్యావసరాలను అందుబాటులో ఉంచడమే కాకుండా ఈ యాప్ ద్వారా రుణాలను కూడా ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
ఈ యాప్ ద్వారా రుణాలు తీసుకోవడంతో పాటు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి సర్వీసులు కూడా ఆఫర్ చేయాలని టాటా గ్రూప్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్ రుణాలు ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్ లు అందించే బ్యాంకులతో టాటా గ్రూప్ భాగస్వామ్యం కానుంది. అదేవిధంగా క్రెడిట్ కార్డు అప్లికేషన్స్, మైక్రో లోన్స్, మర్చంట్ మేనేజ్‌మెంట్ వంటి సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి టాటా గ్రూప్ ప్రయత్నాలను చేస్తోంది.
ఈ విధంగా టాటా గ్రూప్ అందుబాటులోకి తీసుకు వచ్చే ఈ యాప్ ద్వారా నిత్యవసర వస్తువుల నుంచి మందులు ఫ్యాషన్ అప్పరల్ వరకు వీటిని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించనుంది. చైనాకు చెందిన యాంట్ గ్రూప్ ఈ స్ట్రాటజీని తీసుకువచ్చింది. తర్వాత అమెజాన్, వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్, పేటీఎం వంటి కంపెనీలు ఈ స్ట్రాటజీని అనుసరించాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…