Poonam Kaur: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పుడు కూడా చాలా ఆసక్తికరంగానే ఉంటాయి. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి తప్పించడం కోసం ఇతర పార్టీలన్నీ కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కలిసి ఎన్నికల బరిలో దిగబోతున్నారు.
ఈ క్రమంలోనే తొలి జాబితా కింద టిడిపి జనసేన కూటమి అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. ఇందులో మొత్తం 99 అభ్యర్థులను ప్రకటించగా 94 టిడిపి అభ్యర్థులు కాగా మిగిలిన 5 సీట్లను జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ లిస్టు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెతుతున్నాయి.
నాలుగు సీట్లు పొందడం కోసం ఒక పార్టీ పెట్టి తిరిగి ఆ పార్టీని టిడిపితో కలపడం దేనికి అంటూ పలువురు విషయంపై విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో నటి పూనమ్ కౌర్ కూడా పరోక్షంగా ఈ విషయంపై తనదైన శైలిలో సెటైర్స్ వేశారు. పవన్ కళ్యాణ్ కు ప్యాకేజ్ ఇవ్వటం వల్లే టీడీపీతో కుమ్మక్కయ్యారు అంటూ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
జనసేనకు ఐదు…
ఈ క్రమంలోనే పూనమ్ సోషల్ మీడియా వేదికగా దివంగత నటి శ్రీదేవి కుక్కతో ఆడుకుంటూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఇది చూసినటువంటి వైసీపీ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేసేస్తున్నారు ఏం టైమింగ్ అక్క మీది అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు టైం చూసి కుక్క ఫోటో వదిలింది అంటూ ఈ ఫోటోలపై కామెంట్ లు చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…