Tejaswini Reddy : తెలంగాణ రాష్ట్రానికి చెందిన 27 ఏళ్ల తేజస్విని రెడ్డి లండన్ లో ఎంఎస్ చేయడానికి రెండేళ్ల క్రితం వెళ్ళింది. అయితే తాజాగా ఆమె చదువు అయిపోయి తిరిగి ఇండియా రావాల్సి ఉండగా ఇంతలోనే ఒక కిరాతకుడు ఆమెను హత్య చేసాడు. స్థానిక వెంబ్లే ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌కే చెందిన బ్రెజిల్ కి చెందిన వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు చెబుతున్నారు. లండన్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. విషయం తెలిసి తేజస్విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. త్వరలో తేజస్వినికి పెళ్లి చేయాలని అనుకుంటుండగా ఇలా జరిగిందని బాధపడ్డారు.
మరో అమ్మాయి మీద దాడి…
లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో చదువుతున్న తేజస్విని రెండు నెలల క్రితమే ఇండియా రావాల్సి ఉండగా ఆగష్టులో వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని బ్రాహ్మణపల్లివాసి. తేజస్వని అన్న కూడా ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు. తండ్రి ఎలక్ట్రీషియన్ కాగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చదువుయ్యాక కూతురికి పెళ్లి చేయాలని అనుకున్నారు. లండన్ లోని స్థానిక మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నీల్డ్ క్రెసెంట్‌లో జరిగిన ఈ ఘటనలో తేజస్విని కత్తిపోట్లకు గురై అక్కడికిక్కడే మృతి చెందగా 28 సంవత్సరాల అఖిల అనే మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అఖిలకు ప్రాణాపాయం లేదని తెలిసింది. జరిగిన దారుణం గురించి తేజస్విని సమీప బంధువు విజయ కుటుంబ సభ్యులకు తెలియచేశారు. తేజస్విని తన స్నేహితులతో కలిసి ఉండే అపార్ట్‌మెంట్‌లోకి బ్రెజిల్‌కు చెందిన ఆగంతకుడు వారం రోజుల క్రితం కూడా వెళ్లాడని పోలీసులు నిర్థారించారు. హత్య చేసిన వ్యక్తి పేరు కెవెన్ ఆంటోనియో లౌరెన్సోడి మోరియస్ అని పేర్కొంటూ ఫోటో కూడా విడుదల చేశారు. ఇక తేజస్విని మృత దేహం ఇండియా రావడానికి త్వరిత చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…