Categories: FeaturedMovie News

లిప్ లాక్ సీన్ పై అభ్యంతరం.. ప్రదర్శన నిలిపివేత.. ‘నయీం డైరీ’ సినిమా దర్శకుడు, నిర్మాతకు నోటీసులు..

నయీండైరీ చిత్రంలో గాయ‌ని బెల్లి ల‌లిత క్యారెక్ట‌ర్ అభ్యంత‌ర‌క‌రంగా ఉందంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్ర‌యించారు ల‌లిత కుమారుడు సూర్య ప్ర‌కాష్. మావోయిస్ట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన నయీం రాష్ట్రంలో ఎంతటి సంచలనాలను సృష్టించారో తెలిసిందే. 1999లో బెల్లి ల‌లిత దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. కాగా అప్ప‌ట్లో ఆమెని న‌యీం హ‌త్య చేయించాడ‌ని కుటుంబ‌స‌భ్యులు ఆరోపించారు.

పోలీసులు పెంచి పోషించిన గ్యాంగ్‌స్టర్‌ నయీం ఆగడాలు ఎక్కువైపోతున్న నేపథ్యంలో ఐదేళ్ల క్రితం ఆయన్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. తాజాగా అతడి డైరీ ఆధారంగా ఇవాళ ‘నయూం డైరీ’ చిత్రం రిలీజ్ అయింది. ఈ చిత్రంలో బెల్లి లలిత క్యారెక్టర్ అయిన ‘లత’ ను నయీం లిప్ కిస్ చేసే దృశ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆమె కుటుంబ సభ్యులు.

దీంతో హైకోర్టు చిత్రం డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటి వరకు ఈ సినిమాను ప్రదర్శించడానికి వీళ్లేదంటూ తెలియజేసింది. ఇక దీనిపై చిత్ర నిర్మాత వరదరాజు బెల్లి లలిత కుటుంబానికి క్షమాపణ చెప్పారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. సినిమాలో ఒక మహిళ పాత్రను చిత్రించి ఆమె అభిమానుల్ని బాధపెట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని.. నిజ జీవితంలో అమరులైన ఆ మహిళ కుటుంబసభ్యులకు తాము క్షమాపణ చెబుతున్నామని.. అటువంటి అసభ్యకర సన్నివేశాలను ఆ చిత్రం నుంచి తొలగిస్తామని అతడు తెలిపాడు. వారి మనోభావాల్ని గాయపరిచినందుకు మేము భేషరతుగా క్షమాపణ చెప్తున్నామన్నారు. ఇక ఈ సినిమాలో నయీం పాత్ర పోషించిన వశిష్ఠ సింహ నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాకు రచన, డైరెక్టర్ గా దాము బాలాజీ పని చేయగా.. అరుణ్ కుమార్ సంగీత దర్శకుడిగా పని చేశాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago