షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ స్టార్ గా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. “వైవా” అనే షార్ట్ కామెడీ వీడియోతో 2013లో యూట్యూబ్ లోకి అడుగుపెట్టిన ఇతను గత ఏడేళ్ళుగా వరుస షార్ట్ ఫిలిమ్స్ తో నటనలో మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత విడుదలైన “ది సాఫ్ట్ వేర్ డెవలపర్”, “సూర్య” వంటి వెబ్ సిరీస్ లతో యూట్యూబ్ లో మంచి క్రేజ్ సంపాదించి మిలియన్ వ్యూస్ తో దూసుకుపోయాడు. ఒకవైపు వెబ్ సిరీస్ తోనే కాకుండా ప్రైవేటు సాంగ్స్ తో యూట్యూబ్ స్టార్ గా ఎదిగాడు.
ఆఫేమ్ తోనే అతడు ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5 లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి నుంచి అతడు హౌస్ లో తన కంటూ ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకొని మైండ్ గేమ్ ఆడాడు. సిరి, జెస్సీతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తూ.. వాళ్ల కోసం కూడా స్టాండ్ తీసుకొని ముందుకు సాగాడు. ఇక మొన్న ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి షణ్ముఖ్ జశ్వంత్ ఆట తీరులో పూర్తిగా తేడా వచ్చేసింది. అస్సలే మోజ్ రూంకి పరిమితమై.. ఏ మాత్రం ఆట ఆడటం లేదనేది నెటిజన్లు మండిపడుతుందటే..
సిరితో అతడు చేసే రొమాన్స్.. ప్రేక్షకులు అసహ్యం అనుకునే రీతిలో ఉంటున్నాయి. ఇక ఆ రోజు నుంచి అతడు సిరిని సాధించుకునే పనిలో పడిపోయాడు. సిరి ఎవరితో మాట్లాడినా.. డ్యాన్స్ వేసినా.. పాటలు పాడిడా.. తన పర్మిషన్ తీసుకోవాలని సిరికి హుకుం జారీ చేస్తున్నాడు. తను ఒంటరి వాడిని అయిపోతున్నాననే భావనతో అలా చేస్తున్నాడా.. లేదా మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ.. అతడి ప్రవర్తపై నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి.
అయితే యాంకర్ రవి ఎలిమినేట్ అయిన తర్వాత.. ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియని పరిస్థితి. అయితే షణ్ముక్ ఈ వారం హౌజ్ నుంచి బయటకు వస్తాడని సోషల్ మీడియాలో వార్తల హల్ చేస్తున్నాయి. యాంకర్ రవి మాదిరిగానే చివరి నిమిషం వరకు ఇలా జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ.. సన్నీ తర్వాత రెండో స్థానంలో ఉన్న షణ్ముక్ ఎలిమినేషన్ అనేది ఫేక్ అనే చెప్పాలి. విన్నర్ గా నిలుస్తాడని ఎంతో ఆశగా ఎదురురుచూసిన తన అభిమానులకు అతడి ప్రవర్తన రుచించడం లేదు. కేవలం సిరిని సాధించడంలోనే అతడు ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే అతడిపై నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…