Telangana: తెలంగాణ ఎన్నికల ఫలితాలు టిడిపికి కలిసొచ్చేనా… వైసిపి ప్రమాదంలో ఉన్నట్టేనా?

Telangana: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలలో ఏ సంఘటన జరిగినా ఇరు రాష్ట్ర ప్రజలు నాయకులు ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అయితే తాజగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా పెద్ద ఎత్తున బారాస, కాంగ్రెస్ పార్టీలో పోటీ పడుతూ ప్రచార కార్యక్రమాలను చేశారు. అయితే రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించినటువంటి బారాస పార్టీకి ప్రజలు మద్దతు తెలుపకపోగా హస్తం చేతిలో హస్తం వేసి కాంగ్రెస్ కి పట్టం కట్టారు.

ఇలా తెలంగాణలో పదేళ్ల బారాసపాలనకు ప్రజలు పులిస్టాప్ పెట్టారని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని తెలుస్తోంది. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఎన్నికలపై ఆంధ్ర ప్రదేశ్ నాయకులు ఎంతో ఆసక్తి కనబరిచారు. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసి కొంతమేర ఏపీ నేతలలో కూడా గుబులు మొదలైందని తెలుస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడుతో ఎంత సన్నిహితంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఎలాంటి అధికారక ప్రకటన లేకుండా తెలంగాణలో కాంగ్రెస్ తో చేతులు కలిపి ఓట్లు మొత్తం కాంగ్రెస్ కి పడేలా వ్యూహం రచించారు.

ఇక రేవంత్ రెడ్డి గెలవగానే కాంగ్రెస్ జెండాలతో పాటు ఊరేగింపులో పసుపు జెండాలు కూడా కనిపించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా రేవంత్ రెడ్డి ఎట్టకేలకు విజయం సాధించార. అయితే రేవంత్ రెడ్డికి ఎంతో సహాయం చేసినటువంటి చంద్రబాబు నాయుడుకి కూడా వచ్చే ఎన్నికలలో రేవంత్ సహాయ పడబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ తో చేతులు కలిపారో ఇక్కడ కూడా కాంగ్రెస్ తో చేతులు కలిపి ఎన్నికలలో పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు వ్యూహం రచిస్తున్నారని తెలుస్తుంది.

అలర్ట్ అవుతున్న వైసీపీ నేతలు…

ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తుకుదురుచుకున్నారు. మరోవైపు బీజేపీ పార్టీని కూడా కలుపుకోవడానికి కేంద్రంతో పవన్ కళ్యాణ్ చర్చలు కూడా జరుపుతున్నారు. అన్ని పార్టీలు కలిసి ఈసారి వైసిపి పార్టీపై దండెత్తబోతున్నాయని తెలుస్తుంది . ఇలా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి బారాస పార్టీకే ప్రజలు మద్దతు తెలుపలేదు దీంతో వైసిపి నేతలు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేకపోతే తెలంగాణలో బారాసకి వచ్చిన పరిస్థితి ఏపీలో వైఎస్ఆర్సిపి పార్టీకి కూడా రాబోతోంది అంటూ మరికొందరు నేతలు భావిస్తున్నారు అయితే రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతాయో తెలియదు కనుక ఏపీ రాజకీయాలలో ఏం జరగబోతుందో తెలియాల్సి ఉంది.