బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సమీరా షరీఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కేవలం నటిగా మాత్రమే కాకుండా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆడపిల్ల సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ సీరియల్స్ ద్వారా ఎంతోమంచి గుర్తింపు సంపాదించుకున్న సమీరా ఆ తర్వాత ముద్దుబిడ్డ, అన్నా చెల్లెలు, భార్యామణి వంటి సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు.
బుల్లి తెరపై నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సమీరా ఆ తర్వాత నిర్మాతగా మారారు.నిర్మాతగా మారి ఎన్నో తమిళ సీరియల్స్ నిర్మించి అందులో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.కేవలం సీరియల్స్ లో మాత్రమే కాకుండా అదిరింది అనే షోకి యాంకరింగ్ చేస్తూ యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక సమీర వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ సనా కొడుకు అన్వర్ ను పెళ్లి చేసుకుంది.అన్వర్ తమిళ సీరియల్స్ లో హీరోగా నటించడమే కాకుండా తమిళ సీరియల్స్ కి నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే గత కొంత కాలం నుంచి బుల్లి తెరకు దూరమైన సమీరా తాను తల్లి కాబోతుందన్న విషయాన్ని తెలుపుతూ తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
తాజాగా ఈ నటి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 4 వ తేదీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఈమె ఈ విషయాన్ని అధికారికంగా తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన ఫోటోను కూడా అభిమానులతో పంచుకోవడంతో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి ఈ విషయం తెలిసిన సదరు నటీనటులు, అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…