Thammareddy Bharadwaja: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి ది అలుపెరుగని ప్రస్థానం . ఎవరి అండ దండాలు లేకుండా ఒంటరిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోగా గుర్తింపు పొందిన చిరంజీవి స్థానం ఇప్పటికీ పదిలంగానే ఉంది. మధ్యలో కొంతకాలం రాజకీయాలలో ప్రవేశించి సినిమాలకు దూరమైనప్పటికీ.. మళ్లీ ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా నిరూపించుకున్నాడు.
ఇక అప్పటినుండి వరస సినిమాలలో నటిస్తూ నేటి యువ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన సినిమాలలో మరొక హీరో ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ విషయం గురించి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సోషల్ మీడియాలో చిరు మార్కెట్ తగ్గిపోయిందని వస్తున్న వార్తలలో నిజం లేదని.. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆయన మార్కెట్ ఆయనకు సపరేట్గా ఉంటుందని వెల్లడించాడు.
చిరంజీవిగారిని ఎవరో వచ్చి జాకీ పెట్టి లేపాల్సినంత అవసరం లేదని.. ఆయన ఫాలోయింగ్, రెవెన్యూ ఆయనకు ఉన్నాయని తమ్మారెడ్డి వెల్లడించాడు. ఇక ఈ సందర్భంగా నాగబాబు గురించి మాట్లాడుతూ సంచలనం వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న నాగబాబు చిరంజీవికి రెడ్ కార్పెట్ పరిచి ఆ తర్వాత చిరంజీవి గురించి తక్కువగా మాట్లాడారని చెప్పుకొచ్చాడు.
ఇక నాగబాబు చేసిన వ్యాఖ్యల గురించి తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ… చిరంజీవి గారిని ఎవరు తక్కువ చేసి మాట్లాడారని నాగబాబు వారు అన్నారు.. కానీ చిరంజీవి అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరని.. మనం అలాంటి విషయాలను పట్టించుకుంటే ఎదుటివారి స్థాయిని పెంచి చిరు స్థాయి తగ్గించినట్లు అవుతుందని తమ్మారెడ్డి వెల్లడించాడు. అందువల్ల నాగబాబు గారు అలాంటి విషయాలను మాట్లాడకపోతే చిరంజీవి గారి గౌరవం ఇంకా పెరుగుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…
బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…
ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఫాస్ట్…
అవసరానికి మించిన నిద్ర తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు మనిషి ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైన అంశం.…
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ…
విజయ్–రష్మిక పెళ్లి శుభకార్యం… సోషల్ మీడియా ఫైర్ ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో సౌత్ ఇండియా స్టార్…