Thammareddy Bhardwaja : సీనియర్ నిర్మాత, డైరెక్టర్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ లైగర్ సినిమా గురించి ఘాటుగా స్పందించారు. విజయ్ ప్రవర్తనను కామెంట్స్ చేసారు, ఎగిరెగిరి పడితే ఇలాగే ఉంటుంది అంటూ అభిప్రాయపడ్డారు. సినిమా ఇండస్ట్రీ లో జరుగుతున్న పరిణామాలపై స్పందించే తమ్మారెడ్డి ముక్కుసూటిగా తన అభిప్రాయాలను వెల్లడిస్తారు. సినిమా ఇండస్ట్రీ లో ఉన్న సమస్యల గురించి సినిమాలను తీస్తున్న విధానం గురించి ఇంతకుముందు కూడా ఎన్నో సార్లు విమర్శనాత్మక సూచనలను చేశారు, అయితే ఇపుడు లైగర్ సినిమా ఫలితం గురించి మాట్లాడారు.
చిటికెలు వేసి చూడమంటే చిటికెలు వేసి ప్లాప్ చేసారు…
సినిమా ప్రమోషన్స్ అప్పుడు ఎగిరెగిరి పాడ్డాడు విజయ్, బాగా ఆటిట్యూడ్ చూపించాడు అంటూ తమ్మరడ్డి అభిప్రాయపడ్డారు. మా సినిమాను చూడండి అంటూ వేడుకుంటే ప్రేక్షకులు సినిమా చూస్తారు అంతే కానీ చిటికెలు వేసి సినిమా చూడండి అంటే ఇలానే ఫలితం ఉంటుంది ఆడియన్స్ కూడా చిటికెలు వేసి ప్లాప్ చేసారు. ఇష్టమొచ్చినట్లు హీరోలు ఊరికే స్టేట్మెంట్స్ ఇస్తే ఇలానే ఉంటుంది దేశాన్ని ఊపేస్తాం… తగలెడతాం అంటూ మాట్లాడితే ఇలానే ఆడియన్స్ సినిమాను తగలేస్తారు అంటూ ఘాటుగా విమర్శించారు.
ఇక సినిమా గురించి మాట్లాడుకోవడం అనవసరం. ట్రైలర్ చూసాక సినిమా చూడాలని అనిపించలేదు అందుకే సినిమా చూడలేదు అంటూ చెప్పారు. నాకు పూరీ జగన్నాథ్ అంటే ఇష్టం. ఆయన సినిమాలు బాగుంటాయి అయితే ఈ సినిమా మాత్రం ఇలా ఎందుకు తీసాడో.. భవిష్యత్తులో చూడాలని అనిపిస్తే లైగర్ చూస్తాను అంటూ చెప్పారు. ఇక ఈ మధ్య కాలంలో డబ్బింగ్ సినిమాలు కూడా బాగా ఆదరణ తెచ్చుకుంటున్నాయంటూ తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…