Featured

Thammareddy Bhardwaja : ఎన్టీఆర్ చనిపోయాక చంద్రబాబు చూడడానికి వచ్చినపుడు అక్కడ ఏం జరిగిందంటే.. : తమ్మారెడ్డి భరద్వాజ

Thammareddy Bhardwaja : అన్ స్టాపబుల్ షో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. బాలయ్య లో కొత్తకోణాన్ని ఆవిష్కరించిన ఈషో బాలయ్య ఎనర్జీ తో వేరే లెవెల్ కి వెళ్లి పోయింది. ఇక ఈ షో సీజన్ 2 మీద ఎన్నో అంచనాలతో ఇటీవలే మొదలయింది. మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వారి అబ్బాయి నారా లోకేష్ ఇద్దరూ వచ్చారు. ఇక ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు బాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్ నుండి సీఎం పదవిని తీసుకోవడం, అప్పుడు జరిగిన పరిణామాలను గురించి మాట్లాడారు. దీంతో ఇప్పుడు మళ్ళీ వాటి గురించి చర్చ మొదలయింది. ఇక ఈ విషయాల మీద సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ గారు మాట్లాడారు.

ఎవరి కోణంలో వాళ్ళు అప్పటి సంఘటన చెబుతున్నారు… ఎన్టీఆర్ చనిపోయిన రోజు జరిగింది అదే…

తమ్మరెడ్డి గారు మాట్లాడుతూ ముప్పై ఏళ్ల క్రితం జరిగిన విషయం గురించి ఇప్పుడు ప్రస్తావన అవసరంలేదు. కాకపోతే ఇక్కడ లక్ష్మి పార్వతి వెన్నోపోటు అంటూ ఆమె కోణాన్ని చెబుతుంది. ఇటు చంద్రబాబు పార్టీ ని కాపాడుకోవడం అంటూ ఆయన కోణాన్ని ఆయన చెబుతున్నారు. వాస్తవం ఏమిటనేది ప్రజలకు అర్థమైన విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు ని తెలుగు దేశం అధినేతగా ఒప్పుకున్నారు, ఎన్నికల్లో గెలిపించారు. కానీ ఆయన పై వీళ్ళు వేసిన మచ్చ అలాగే ఉంది. ఎన్టీఆర్ గారు మరణించక ముందు ఇచ్చిన ధర్మపీఠం అనే ఇంటర్వ్యూలో చంద్రబాబు పార్టీని లాక్కున్నాడు అన్నట్లు గా మాట్లాడారు.

ఇక ఆయన మానసికంగా క్రుంగి పోయి మరణించారు అది వాస్తవం. ఇక ఆయన మరణించిన రోజు నేను వెళ్ళే సరికి కుటుంబం అంతా అక్కడ ఉంది. లక్ష్మి పార్వతి స్వామీ అంటూ ఏడుస్తోంది. నేను వెళ్ళాక అర్థగంట కు చంద్రబాబు అక్కడికి వచ్చారు. లక్ష్మి పార్వతి ఏం మాట్లాడలేదు కానీ ఒక వ్యక్తి మాత్రం చంద్రబాబు ను ఎన్టీఆర్ శవం వద్దకు రానివ్వలేదు. నువ్వే ఆయన చావుకు కారణం, ఆయనను మానసిక క్షోభకు గురి చేసావ్ అంటూ మాటాడాడు. అయితే ఆదే వ్యక్తి మళ్ళీ రెడో సారి చంద్రబాబు సీఎం అయినపుడు నామినేట్ పదవిలో ఉన్నాడు అంటూ తమ్మారెడ్డి అప్పటి విషయాలను చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago