Isha Koppikar: సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పేరు క్యాస్టింగ్ కౌచ్.ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రెటీలు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు అంటూ తాజాగా ఈ కాస్టింగ్ కౌచ్ పై వారు నోరు విప్పారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలాంటి ఇబ్బందులను తప్పకుండా ఎదుర్కొంటారని ఎంతోమంది సెలబ్రిటీలు ఈ విషయాన్ని బహిరంగంగా తెలియజేశారు.
ఇదిలా ఉండగా ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఇషా కొప్పికర్ తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పారు. అయితే ఒక సమయంలో ఈమె స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ప్రస్తుతం వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
ఇలా ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ తాను కూడా కెరియర్ మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో పాకెట్ మనీ కోసం మోడలింగ్ వైపు వచ్చానని,ఇలా మోడలింగ్ చేస్తున్న సమయంలో ఓ నిర్మాత నుంచి తనకు ఫోన్ వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆ నిర్మాత ఫోన్ చేసి అవకాశం ఉంది హీరోని సంప్రదించమని చెప్పారు.
ఇక ఆ హీరోకి ఫోన్ చేస్తే నన్ను ఒంటరిగా రమ్మని నాతో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పారు. నా వెంట స్టాప్ కూడా ఉండకూడదని చెప్పడంతో అలాగే వెళ్లాను. అయితే అక్కడికి వెళ్లి అతను మాట్లాడిన మాటలను విన్న తర్వాత అసలు విషయం అర్థమైంది. వెంటనే నిర్మాతకు ‘నా టాలెంట్, లుక్స్‌తో ఇక్కడకు వచ్చాను. అదే విధంగా నాకు అవకాశాలు వస్తే చేస్తాను’ అని చెప్పడంతో నాపై ఆ నిర్మాత హీరోయిన్ తో కోపం తెచ్చుకుని ఆ ప్రాజెక్టు నుంచి నన్ను తప్పించారని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు. ‘ఏక్ థా దిల్ ఏక్ థా ధడ్కన్’ తో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా కొనసాగారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…