Anasuya Emotiona Post: నా కెరీర్ లోనే ఆ మూవీ ఓ మలుపు.. ఎమోషన్ పోస్టు చేసిన అనసూయ..!
Anasuya Emotiona Post: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటికే ప్యాన్ ఇండియా సినిమాగా విడుదలైన పుష్ప అన్ని భాషల్లో కూడా భారీ కలెక్షన్లను రాబట్టింది. రిలీజ్ కు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అందుకు తగ్గట్లుగానే దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మంచి హిట్ సాధించడంతో పాటు సమంత ఐటెం సాంగ్ సూపర్ హిట్ అయింది. దీంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ లో ఊరమాస్ లుక్ లో కనిపించాడు. బన్నీతో పాటు రష్మికా, సునీల్, అనసూయ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా కనిపించింది.
విలన్ గా మంగళం శ్రీను పాత్రలో సునీల్ ఇరగదీశాడు. ఆయనకు భార్యగా ద్రాక్షాయణిగా అనసూయ కనిపించింది. అయితే ఈ క్యారెక్టర్ల నిడివి తక్కువగా ఉన్నా..కూడా సినిమాలో కీలక పాత్రలుగా ఉన్నాయి. పుప్ప రెండో భాగం ది రూల్ లో అనసూయ, సునీల్ పాత్రలు కీలకం కానున్నాయి.
తాజాగా తన ద్రాక్షాయణి క్యారెక్టర్ పై అనసూయ స్పందించింది. తాజాగా ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ లో పుష్ప మూవీ ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ మినహా తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. తాజాగా తన ఫ్యామిలీలో కలిసి అనసూయ పుష్ప సినిమాను చూసింది. తన క్యారెక్టర్ ద్రాక్షాయణికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నాకు, నా సినీ కెరీర్‌కు పుష్ప సినిమా గేమ్ చేంజర్ లాంటిది. ఈ అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్, సుకుమార్ సర్‌కు థ్యాంక్స్. పుష్పను ప్రైమ్‌లో చూడండి’ అని దాక్షాయణి పాత్ర గురించి అనసూయ చెప్పుకొచ్చింది.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…