Featured

కొడుకు కోసం కన్న కూతురును బలిచ్చిన తండ్రి.. ఎక్కడంటే..?

దేశంలో టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా కొందరి ఆలోచనా తీరులో మాత్రం మార్పు రావడం లేదు. దేశంలో నేటికీ లక్షల సంఖ్యలో ప్రజలు మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. శాస్త్రవేత్తలు అరచేతిలో అద్భుతాలను సృష్టిస్తోంటే కొందరు మాత్రం నరబలులు, జంతుబలులు చేస్తూ అమాయక ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. తాజాగా జార్ఖండ్ లో చోటు చేసుకున్న దారుణ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.

కొడుకు పుట్టాలంటే కూతురును బలి ఇవ్వాలని క్షుద్రపూజలు చేసే వ్యక్తి చెప్పగా ఆ వ్యక్తి మాటలను నమ్మి కన్నతండ్రే కూతురును దారుణంగా చంపేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీకి సమీపంలో సమన్ నెగాసియా అనే 26 సంవత్సరాల వ్యక్తి కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం అతనికి వివాహం కాగా సమన్ దంపతులకు ఒక కూతురు ఉంది. అయితే సమన్ కు మాత్రం కొడుకు పుడితే బాగుంటుందనే కోరిక బలంగా ఉండేది.

కొడుకు కోసం సమన్ బాబాలను, క్షుద్రపూజలు చేసేవాళ్లను తరచూ కలుస్తూ ఉండేవాడు. అతని కోరిక విన్న ఒక మాంత్రికుడు కూతురును బలి ఇస్తే తప్పకుండా కొడుకు పుడతాడని చెప్పాడు. దీంతో సమన్ తన ఆరేళ్ల కూతురును బలి ఇచ్చాడు. అయితే కూతురు కనిపించకపోవడంతో కంగారు పడిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సమన్ ను అరెస్ట్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు కూతురును బలివ్వాలని సమన్ కు చెప్పిన క్షుద్రపూజలు చేసే వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago