Jayan: డూప్ లేకుండా సాహసం చేసి హెలికాప్టర్ ప్రమాదంలో చిన్న వయసులోనే కన్నుమూసిన హీరో..?
Jayan: సాధారణంగా హీరోలు సినిమాలలో కొన్ని యాక్షన్ సన్నివేశాలలో డూపులను వాడుతూ ఉండటం సర్వసాధారణమైన విషయమే. కొందరు హీరోలు ధైర్యం చేసి మరీ రిస్క్ అయినా పర్వాలేదు ఎఫెక్ట్ బాగా రావాలి అన్న ఉద్దేశంతో అటువంటి సన్నివేశాల్లో నటిస్తూ ఉంటారు. అయితే అటువంటి భయంకరమైన సన్నివేశాలు ఎక్కువగా నిపుణుల పర్యవేక్షణలో చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు నిపుణుల పర్యవేక్షణలో చేసినప్పటికీ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు ఉంటారు. అలా కొన్ని కొన్ని సార్లు చేసే చిన్న పొరపాట్లే భారీ మూల్యానికి దారి తీస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరో విషయంలో కూడా అదే జరిగింది. ఆ హీరో పేరు జయన్.
జయన్ 1972 లో మలయాళం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా మలయాళంలో 100కు పైగా సినిమాల్లో నటించి అరుదైన ఘనతను సాధించుకున్నాడు. అంతే కాకుండా క్లాస్ గా సాగే కేరళ ఎంటర్టైన్మెంట్ ని యాక్షన్ వైపు మళ్ళిన వారిలో ఇతని మొదటి పేరు అని చెప్పవచ్చు. అలా ఇతను కోట్లాది మంది అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. అంతేకాకుండా అతనికి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉండేది. కేవలం ఎనిమిది ఏళ్లలో 100 మైలురాయిని చేరుకోవడం అంటే అంత ఈజీ కాదు. అయితే జయన్ కు అంతటి పేరు రావడానికి కారణం అతను చేసిన పోరాటాలే.
ఇతను తన సినిమాలలో చాలా వరకు డూప్ లేకుండా తానే స్వయంగా కంపోజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.అతని అసలు పేరు కృష్ణన్ నాయర్. అలా ఒకసారి అతను హిందీ సినిమా రీమేక్ కి ఒప్పుకున్నారు. 1965 లో యాష్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన వక్త్ సినిమాని 1980లో కొలిలక్కం సినిమా పేరు తో పునః నిర్మించారు పిఎన్ సుందరం దర్శకులు.ఇక అందులో క్లైమాక్స్ లో ఒక వ్యక్తి బైక్ ని నడుపుతుండగా వెనుక కూర్చున్న జయన్ తనపై నుంచి వెళ్తున్న హెలికాప్టర్ రాడ్ ని అందుకునే సీన్ వుంది. ఇక ఆ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్న సమయంలో ఫస్ట్ టేక్ లోనే ఓకే అయింది.
కానీ జయన్ కి కాస్త అసంతృప్తి కలగడంతో మళ్లీ చేద్దామని అన్నారు. ఇక రెండవ సారి చేస్తున్న సమయంలో హెలికాప్టర్ ఎక్కిన తర్వాత పట్టు తప్పడంతో కిందపడిపోయారు. ఇక ఆ ప్రమాదంలో హీరో జయన్ అక్కడికక్కడే మరణించారు. అయితే వాహనం కూలిపోయిన కూడా పైలెట్ బతికాడు. ఇక జయన్ చనిపోయిన సమయంలో అతను నటించిన దీపం సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ఇక అతడి మరణవార్త విన్న అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. ఇక అతను చనిపోయిన తరువాత కూడా ఆయన సినిమాలు 8 రిలీజ్ అయ్యాయి. ఈ సంఘటన 1980 నవంబర్ 16న చోటు చేసుకుంది. ఇక అప్పటికి అతని వయసు కేవలం 41 సంవత్సరాలు మాత్రమే.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…