the-media-has-been-waiting-total-night-for-prabhas-by-request
Prabhas: పాన్ ఇండియా స్టార్ గా ఎంతో పేరు సంపాదించుకున్న ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఎక్కడున్నారు అంటే అక్కడ అభిమానులు మీడియా పెద్ద ఎత్తున ఆయనతో ఫోటోలు దిగడం కోసం, ఆయన ఫోటోలు కోసం ఎగబాకుతూ ఉంటారు. ఈ క్రమంలోనే దర్శకుడు ఓం రౌత్ ఘనంగా పార్టీ ఇవ్వడంతో ఆది పురుష్ చిత్ర బృందం మొత్తం ఆ దర్శకుడి ఇంటికి క్యూ కట్టారు.
ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు అందరూ కూడా డైరెక్టర్ ఓం రౌత్ ఇంటికి వెళ్ళారని తెలియడంతో మీడియా ఒక్కసారిగా అక్కడ వాలిపోయింది. రాత్రంతా ఎంతో ఘనంగా పార్టీ చేసుకున్న అనంతరం మరుసటి రోజు ఉదయం ప్రభాస్ అక్కడినుంచి వెళ్ళడానికి బయటికి రాగా మీడియా ఒక్కసారిగా ప్రభాస్ ను చుట్టుముట్టింది.
ప్రభాస్ అక్కడి నుంచి కారు వద్దకు వెళ్తుండగా మీడియా సర్ మీ కోసం రాత్రి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాము.. ప్లీజ్ అంటూ అతనిని రిక్వెస్ట్ చేయడంతో డార్లింగ్ మీడియా అభ్యర్థన మేరకు కాసేపు అక్కడ నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన అనంతరం ప్రభాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా ప్రభాస్ ఫోటో కోసం మీడియా రాత్రంతా ఇలా వెయిట్ చేయడం చూస్తుంటేనే అతనికి ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది.
ఇకపోతే ప్రభాస్ కృతిసనన్ హీరోహీరోయిన్లుగా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా మిగిలిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన పార్టీ ఇవ్వడంతో చిత్రబృందం మొత్తం ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్టు కే సినిమాలతో బిజీగా ఉన్నారు..
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…