Featured

Naga Babu: విష్ణు హెయిర్ డ్రెస్సర్ కి సహాయం చేసిన నాగబాబు… మంచు ఫ్యామిలీ రియాక్షన్ ఇదే!

Naga Babu:ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా సోషల్ మీడియాలో నిలిచే మంచు కుటుంబం తాజాగా మరో వివాదంలో ఇరుక్కుంది. ఈ క్రమంలోనే విష్ణు హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను ఫిబ్రవరి 17వ తేదీన 5 లక్షల విలువచేసే సామాగ్రిని దొంగతనం చేశారని ఆయన పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే.

Naga Babu: విష్ణు హెయిర్ డ్రెస్సర్ కి సహాయం చేసిన నాగబాబు… మంచు ఫ్యామిలీ రియాక్షన్ ఇదే!

ఈ క్రమంలోనే తనపై అనవసరమైన అభాండాలు వేస్తూ కేసు పెట్టారని, తనని కులం పేరుతో దూషిస్తూ ఎంతో అవమానించడం వల్లే నేను ఇంటి నుంచి బయటకు వచ్చానని నాగ శ్రీను ఒక వీడియో ద్వారా అసలు విషయం బయట పెట్టారు. తనని మోకాళ్లపై కూర్చోబెట్టి కులం పేరుతో తనని,తన తల్లిని దూషిస్తూ ఎంతో అవమానించారని నాగ శ్రీను వెల్లడించారు.

Naga Babu: విష్ణు హెయిర్ డ్రెస్సర్ కి సహాయం చేసిన నాగబాబు… మంచు ఫ్యామిలీ రియాక్షన్ ఇదే!

ప్రస్తుతం తన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో ఉందని తన వైద్య ఖర్చులకి కూడా డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు నాగ శ్రీను ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది మోహన్ బాబు నాగ శ్రీనుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

నాగబాబుకు కృతజ్ఞతలు తెలిపిన నాగ శ్రీను…

ఇదిలా ఉండగా మంచు విష్ణు హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను వీడియో స్పందించిన నాగబాబు తనని పిలిచి తన తల్లి హాస్పిటల్ ఖర్చులకు 50 వేల రూపాయల సహాయం చేశారు.అలాగే నాగ శ్రీను పిల్లల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని వారికి ఏ ఇబ్బంది వచ్చినా అపోలో హాస్పిటల్ లో ఉచితంగా మెడికల్ టెస్టులు చేయించుకొనే సౌకర్యాన్ని కూడా కల్పించారు.ఈ విధంగా హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను కుటుంబానికి నాగబాబు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇక నాగ శ్రీను జీతం ఇవ్వలేదంటూ చేసిన ఆరోపణలపై మంచు కుటుంబానికి చెందిన పిఆర్ టీమ్ స్పందించింది. నాగ శ్రీనుకి ప్రతి నెలా జీతాన్ని అతని అకౌంట్‌లోనే జమ చేస్తున్నామని, గత నెల కూడా అతని అకౌంట్ లో తన జీతం డిపాజిట్ అయిందని వెల్లడించారు. అయితే ఇలా మంచు కుటుంబంతో వివాదం ఉన్న వ్యక్తికి నాగబాబు సహాయం చేయడంతో ఇండస్ట్రీలో పలు చర్చలు మొదలయ్యాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

5 minutes ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

41 minutes ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

3 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

4 hours ago

యంగ్ ఏజ్‌లోనే లివర్ రిస్క్.. ఫ్యాటీ లివర్‌కు ఆహారమే కారణమా? కొత్త అధ్యయనం ఏమంటోంది?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…

4 hours ago

రహానేకు డబుల్ షాక్.. ఓటమి + రూ.12 లక్షల జరిమానా

ఐపీఎల్ 2026 సీజన్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…

4 hours ago