మధుమేహం.. ప్రస్తుత కాలంలో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి రావడానికి ఫలానా కారణం అని ఏమీ లేకపోయినప్పటికీ మనం తీసుకునే ఆహార విషయంలో కానీ, లేదా వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. అయితే మధుమేహంతో బాధపడేవారు ఇప్పటివరకు వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడానికి సరైన ఆహార నియమాలను,శరీరానికి తగిన వ్యాయామం చేస్తూ, ఇన్సులిన్ ఇంజెక్షన్లను తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుతున్నారు.
అయితే ఈ వ్యాధిని నియంత్రించడానికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్ పరిశోధకులు ఒక కొత్త పద్ధతిని గుర్తించారు. సాధారణంగా మన శరీరంలో క్లోమగ్రంథిలోని బీటా కణాలు నశించి పోవడం వల్ల ఇన్సులిన్ కొరత ఏర్పడి టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతుంటారు. అయితే ఈ గ్రంధులు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ఏ విధంగా చేపడతాయి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
ఈ పరిశోధనలో భాగంగా మనం తీసుకునే ఆహారం పైరువేట్ కైనేస్ అనే ఎంజైమ్ చక్కెరలను శక్తిగా మారుస్తుంది. ఈ క్రమంలోనే క్లోమ గ్రంధిలోని బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని చేస్తాయని ఈ పరిశోధనలో గుర్తించారు. ఈ పరిశోధనలో భాగంగానే ఈ పైరువేట్ కైనేస్ ఎంజైమ్ లను ఎలుకలు, మానవ కణాలపై పైరువేట్ కైనేస్ తరహా ఎంజైమ్ ఉన్న మందులను ప్రయోగించినప్పుడు ఇన్సులిన్ మోతాదు నాలుగు రెట్లు పెరిగిందని,మన శరీరంలో తగినంత చక్కెర మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే ఇలా గుర్తించామని పరిశోధకులు తెలిపారు.
ఈ ప్రయోగాల ఆధారంగా పైరువేట్ కైనేస్ ఎంజైమ్‌ను చైతన్యవంతం చేసే మందులను వాడటం ద్వారా మధుమేహాన్ని కొంతవరకు నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.అయితే ఈ విషయంపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, ఈ సందర్భంగా పరిశోధకులు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…