మధుమేహానికి సరికొత్త చికిత్స పద్ధతి ఇదే!

0
111

మధుమేహం.. ప్రస్తుత కాలంలో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి రావడానికి ఫలానా కారణం అని ఏమీ లేకపోయినప్పటికీ మనం తీసుకునే ఆహార విషయంలో కానీ, లేదా వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. అయితే మధుమేహంతో బాధపడేవారు ఇప్పటివరకు వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడానికి సరైన ఆహార నియమాలను,శరీరానికి తగిన వ్యాయామం చేస్తూ, ఇన్సులిన్ ఇంజెక్షన్లను తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుతున్నారు.

అయితే ఈ వ్యాధిని నియంత్రించడానికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్‌ మాడిసన్‌ పరిశోధకులు ఒక కొత్త పద్ధతిని గుర్తించారు. సాధారణంగా మన శరీరంలో క్లోమగ్రంథిలోని బీటా కణాలు నశించి పోవడం వల్ల ఇన్సులిన్ కొరత ఏర్పడి టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతుంటారు. అయితే ఈ గ్రంధులు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ఏ విధంగా చేపడతాయి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

ఈ పరిశోధనలో భాగంగా మనం తీసుకునే ఆహారం పైరువేట్‌ కైనేస్‌ అనే ఎంజైమ్‌ చక్కెరలను శక్తిగా మారుస్తుంది. ఈ క్రమంలోనే క్లోమ గ్రంధిలోని బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని చేస్తాయని ఈ పరిశోధనలో గుర్తించారు. ఈ పరిశోధనలో భాగంగానే ఈ పైరువేట్‌ కైనేస్‌ ఎంజైమ్ లను ఎలుకలు, మానవ కణాలపై పైరువేట్‌ కైనేస్‌ తరహా ఎంజైమ్‌ ఉన్న మందులను ప్రయోగించినప్పుడు ఇన్సులిన్ మోతాదు నాలుగు రెట్లు పెరిగిందని,మన శరీరంలో తగినంత చక్కెర మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే ఇలా గుర్తించామని పరిశోధకులు తెలిపారు.

ఈ ప్రయోగాల ఆధారంగా పైరువేట్‌ కైనేస్‌ ఎంజైమ్‌ను చైతన్యవంతం చేసే మందులను వాడటం ద్వారా మధుమేహాన్ని కొంతవరకు నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.అయితే ఈ విషయంపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, ఈ సందర్భంగా పరిశోధకులు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here