Pradeep: బుల్లితెరపై ఎంతోమంది ఫిమేల్ యాంకర్లుగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మేల్ యాంకర్లు చాలా తక్కువగా ఉన్నారని చెప్పాలి. ఇలా మేల్ యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ ప్రదీప్ ఒకరు. ఈయన యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఎన్నో బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించేవారు. అయితే ఈయన హీరోగా కూడా 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించారు.
ఈ సినిమా తర్వాత ప్రదీప్ తన తదుపరి సినిమాలను ప్రకటించలేదు. అయితే ఉన్నఫలంగా ఈయన బుల్లితెరపై ఏ ఒక్క కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించలేదు ఇలా బుల్లితెరకు దూరం అవడంతో అందరూ ప్రదీప్ యాంకరింగ్ కి దూరం కావడానికి గల కారణం ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు.అయితే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.
సినిమాలతో బిజీ..
ఇందులో పెద్ద ఎత్తున ఈయన జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వీడియోలో భాగంగా ప్రదీప్ కండలు తిరిగిన శరీరంతో కనిపిస్తూ ఉన్నారు. ఇలా ఈయన భారీ స్థాయిలో కష్టపడుతూ ఉండడంతో తన తదుపరి సినిమా కోసమే ప్రదీప్ ఇలా కష్టపడుతున్నారని తెలుస్తుంది. మరి ఈయన తదుపరి సినిమా ఏంటి ఎలాంటి నేపథ్యంలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనేది తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…