హీరోయిన్ రమ్యకృష్ణ.. కృష్ణవంశీ పెళ్లి జరగడానికి అసలు కారణం ఎవరో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాల క్రితం వరకు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన వారిలో రమ్యకృష్ణ ఒకరని చెప్పవచ్చు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్న పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకొని స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు కృష్ణ వంశీ కూడా విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే కృష్ణవంశీ దర్శకత్వం వహించిన గులాబీ సినిమాలోని “మేఘాలలో తేలిపొమ్మన్నది”అనే పాట ఏ స్థాయిలో గుర్తింపు సంపాదించిందో మనకు తెలిసిందే. ఈ పాటలో కృష్ణవంశీ హీరో చక్రవర్తి, మహేశ్వరి లపై చిత్రీకరించిన ఈ పాట వల్ల రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే హీరోయిన్ రమ్యకృష్ణ ఈ పాటను చూసి ఎంతో ఫిదా అయ్యారట .ఈ క్రమంలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున, రమ్యకృష్ణ జంటగా తెరకెక్కిన “నిన్నేపెళ్లాడుతా” కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కాకపోతే రమ్యకృష్ణ హీరోయిన్ గా కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా చంద్రలేఖ సినిమాలో నటించారు.

ఈ సినిమా కంటే ముందుగా రమ్య కృష్ణన్ కృష్ణవంశీకి పరిచయం చేసింది మాత్రం బ్రహ్మానందం. అయితే అప్పటికే మోహన్ బాబు కృష్ణ వంశీకి “అదిరింది అల్లుడు” సినిమా సెట్ లో భాగంగా రమ్యకృష్ణను పరిచయం చేశారు. అలా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ఆరు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2003లో పెళ్లి బంధం ద్వారా ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే వీరికి ఇద్దరికి ఒక బాబు జన్మించడంతో వీరిద్దరి పేర్లు కలిసి వచ్చే విధంగా బాబుకి రిత్విక్ కృష్ణ అనే పేరు పెట్టుకోవడం విశేషం.