Tik tak: టిక్ టాక్ ద్వారా ఎంతో మంది వారిలో ఉన్నటువంటి టాలెంట్ బయటపెట్టి ఇండస్ట్రీలోకి వచ్చే సెలబ్రిటీలుగా మారిపోయారు. ఇలా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయినటువంటి టిక్ టాక్ ఎంతో మందిని సెలబ్రెటీలుగా మార్చిందని చెప్పాలి. ఇలా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయినటువంటి వారిలో దుర్గారావు దంపతులు ఒకరు.
టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈ దంపతులకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే వీరికి ఉన్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఏకంగా బుల్లితెర అవకాశాలు అలాగే వెండితెర అవకాశాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా వీరి చేసినటువంటి నాది నక్కలీసి గొలుసు అనే పాట ఎంతో ఫేమస్ అయిన విషయం మనకు తెలిసిందే.
ఈ పాట ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి దుర్గారావు దంపతులకు పలు సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయి. అలాగే బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. అయితే ప్రస్తుతం వీరికి అవకాశాలు కాస్త తగ్గాయని చెప్పాలి. కేవలం యూట్యూబ్ వీడియోలు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఇలా ఇండస్ట్రీలో వీరికి అవకాశాలు తగ్గడంతో చేసేదేమీ లేక హైదరాబాద్లో స్థిరపడినటువంటి దుర్గారావు దంపతులు తిరిగి వారి సొంతూరికి వెళ్లిపోయారని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే సొంత ఊరిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే సినిమాలలో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తామని దుర్గారావు దంపతులు తెలియజేస్తున్నారు. ఇక యూట్యూబ్ వీడియోస్ ద్వారా నెలకు సుమారు30000 వరకు ఆదాయం పొందుతున్నారని తెలుస్తోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…