Titan Submarine tragedy : ఉత్తర అంట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ గురించి మనకు తెలుసు. 1912 ప్రాంతంలో జరిగిన టైటానిక్ ప్రమాదంలో సుమారు 1500 మంది మరణించారు. అయితే ఆ షిప్ శిథిలాలను కనుగొన్నా సముద్ర అడుగున ఉన్న వాటిని చేరుకోవడం కష్టం. అయితే ఓషన్ గేట్ సంస్థ తయారు చేసిన టైటన్ సబ్ మెరైన్ తాజాగా ఆ సాహసం చేసింది. ఐదగురు వ్యక్తులు ఆ సబ్ మెరైన్ ద్వారా సముద్రం లోపలికి వెళ్లి టైటానిక్ శిథిలాలను చూడాలని భావించారు. అయితే వారి సహస యాత్ర విషాదంగా మారింది. సముద్రంలోకి వెళ్లిన వారి జాడ రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తెలియరాలేదు. వారికి సబ్ మెరైన్ లో ఉన్న ఆక్సిజన్ నిల్వలు కూడా ఇప్ప్పటికే ఖాళీ అయ్యుంటాయనే అంచనాతో వారు మరణించి ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే గాలింపు చర్యలను మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అయితే చివరికి ఆ సబ్ మెరైన్ సముద్రంలోకి వెళ్లిన కొద్ది గంటల్లోనే పెళ్లిపోయి ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
తిరిగిరాని లోకాలకు ఐదు మంది…
సాహస యాత్ర కోసం కోట్ల డబ్బులు ఖర్చు చేసి మరీ ప్రాణాలను పోగొట్టుకున్నారు టైటన్ సబ్ మెరైన్ యాత్రికులు. ఐదుమందిలో నలుగురు 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు కాగా ఒకరు మాత్రం నిండా ఇరవై ఏళ్ళు కూడా నిండని కుర్రాడు. 19 ఏళ్ల సులేమాన్ తండ్రితో కలిసి టైటానిక్ చూడటానికి సబ్ మెరైన్ లో ప్రయాణం చేసాడు. అయితే తాజాగా సులేమాన్ గురించి సులేమాన్ అత్త చెప్తున్న మాటలు వింటే మరింత బాధ కలుగుతుంది. ఎంజాయ్ చేస్తూ తిరిగే సులేమాన్ కు ఈ ప్రయాణం అసలు ఇష్టం లేదట.
తిరిగి క్షేమంగా వస్తామో రామో తెలియని ఈ యాత్ర గురించి మొదటి నుండి సులేమాన్ భయపడ్డాడు. తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా తండ్రి కోసం వెళ్తున్నట్లు తనతో చెప్పాడని సులేమాన్ అత్త బాధపడ్డారు. తన తండ్రి కోసం వెళ్లిన సులేమాన్ తండ్రితో పాటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అందరినీ కంట తడి పెట్టిస్తోంది. సబ్ మెరైన్ సముద్రంలోకి వెళ్లిన కొద్ది గంటలలోనే పెళ్లిపోయి ఉండవచ్చని అందులో వెళ్లిన వారు మరణించి ఉంటారని ఇప్పటికే చెప్పేసారు అధికారులు. చివరికి వాళ్ళు వెళ్లిన సాహస యాత్ర విషాదాంతంగా ముగిసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…