Categories: FeaturedMovie News

కమెడియన్ అలీ కూతురు ఎంత అందంగా ఉందో తెలుసా..? త్వరలో సినిమాల్లోకి…

టాలీవుడ్ స్టార్ కమెడియన్ల జాబితాను పరిశీలిస్తే అందులో కమెడియన్ అలీ పేరు ముందువరసలో ఉంటుంది. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన అలీ దాదాపు ఐదు దశాబ్దాలుగా తన కామెడితో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తనకు మాత్రమే సొంతమైన కామెడీతో అలీ నవ్వులపువ్వులు పూయిస్తుంటారు. 1968వ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన జన్మించిన అలీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పేద కుటుంబంలో అలీ జన్మించారు. అలీ తల్లి గృహిణి కాగా తండ్రి టైలర్ గా పని చేసే వాడు. 1994 జనవరి 23వ తేదీన అలీకి వివాహం జరిగింది. 1979లో నిండు నూరేళ్లు సినిమా ద్వారా అలీ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, సూపర్ సినిమాలలో అలీ నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కింది. బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన అలీ 50కు పైగా సినిమాల్లో హీరోగా కూడా నటించడం గమనార్హం.
 
అలీ భార్య పేరు జాబేడా సుల్తానా. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అలీ పెద్ద కూతురు పేరు ఫాతిమా రామిజున్ కాగా చిన్న కూతురు పేరు జువేరియా మీతి. అలీ హీరోగా మా గంగానది అనే సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో అలీ చిన్న కూతురు జువేరియా నటిస్తోంది. అలీ పెద్ద కూతురు మెడిసిన్ చదువుతుండగా చిన్న కూతురు జువేరియా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది.
 
జువేరియా చూడటానికి చాలా క్యూట్ గా కనిపిస్తోంది. మరోవైపు అలీ 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేయగా త్వరలో ఆయనకు కీలక పదవి లభించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. కొన్ని రోజుల క్రితం అలీ జగన్ ను కలవగా జగన్ నుంచి ఈ మేరకు హామీ లభించిందని సమాచారం.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago