Categories: FeaturedMovie News

అర్దాంతరంగా కంటికి కానరాని దూరాలకు చేరిన తెలుగు సినీ తారలు …!

సినిమాలు మానవ జీవితంలో ఒక భాగం అని చెప్పవచ్చు. అందులో నటించే నటీనటులకు అంత ప్రాధాన్యత ఇస్తారు మన తెలుగు ప్రేక్షకులు. కేవలం తెలుగు వారే అని కాకుండా తమిళం, కన్నడ ఇలా పలు భాషల్లోని నటీనటులకు వారి వారి అభిమానులు ఎంతగానో వారిని ఆప్యాయంగా కొలుస్తారు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా… పుట్టిన వాడు గిట్టక మానడు అన్న సామెత ఇప్పుడు చెప్పు కోవాలి. దీనికి కారణం మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు వారి చిన్న ఏజ్ లోనే మరణించారు.

ఇటీవల బాలీవుడ్ లో కూడా ఇర్ఫాన్, రిషి కపూర్ ఇలాంటి మంచి హీరోలను సినీ పరిశ్రమ కోల్పోయింది. ఇకపోతే ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగి అర్ధాంతరంగా తనువు చాలించిన అనేకమంది నటీనటుల గురించి ఒకసారి చూద్దామా….

ఈ లిస్టులో మొదటిగా చెప్పుకునేది మహానటి సావిత్రి. అలనాటి కాలంలో సౌత్ సినిమాలను ఏలిన హీరోయిన్ ఎవరూ అంటే ఒకే ఒక పేరు సావిత్రి. సౌత్ ఇండియాలో మొట్టమొదటి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి సావిత్రి. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజెఆర్ వీరందరూ కూడా ఆమె తర్వాతే అన్నట్లుగా ఆమె కాలం కొనసాగింది. ఈవిడ జెమినీ గణేష్ ను ప్రేమ వివాహం చేసుకొని కొన్ని కారణాలవల్ల ఆయనతో విడిపోయింది. ఆ తరువాత తన జీవితంలో చాలా ఆటుపోట్లను ఎదుర్కొని 19 నెలలు కోమాలో ఉండి డిసెంబర్ 26 ,1981 వ సంవత్సరంలో ఆవిడ కన్నుమూశారు. ఆమె కన్నుమూసే సరికి 45 సంవత్సరాలు మాత్రమే.

ఇక ఆ తరువాత అతిలోక సుందరి శ్రీదేవి గురించి మాట్లాడుకోవాలి. తాను బాలనటిగా కెరీర్ ను ప్రారంభించి సావిత్రి తర్వాత అంత స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్ ఎవరు అంటే కేవలం శ్రీదేవి అని మాత్రమే చెబుతారు. 1979వ సంవత్సరంలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి 4 సంవత్సరాల తర్వాత 1983లో వచ్చిన హిమ్మత్ వాలా సినిమాతో అక్కడ ఆమెకు బ్రేక్ లభించింది. ఆ తర్వాత ఆమె అక్కడ కూడా చిన్నగా చిన్నగా టాప్ హీరోయిన్ గా మారిపోయింది. 2018 సంవత్సరంలో దుబాయ్ లోని ఒక హోటల్ లో ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి ప్రాణాలు వదిలేసింది.

ఇక మరో హీరోయిన్ సౌందర్య. దాదాపు పది, పదిహేను సంవత్సరాల వరకు తెలుగు ఇండస్ట్రీలో తను ఏ పాత్ర చేసినా ప్రేక్షకులు ఇట్లే గుర్తుపెట్టుకునే విధంగా ఆవిడ నటన చేసింది. అయితే 2004వ సంవత్సరంలో బిజెపి పార్టీ తరఫున ప్రచారానికి వెళుతున్న మార్గంలో విమానం కూలిపోయి మరణించడం జరిగింది. అప్పటికి కేవలం ఆవిడకు 32 సంవత్సరాలు మాత్రమే. ఇలా వెళితే మనము టాలీవుడ్ లో అనేక మంది హీరో హీరోయిన్ల లిస్టు చెప్పుకుంటా వెళ్లొచ్చు.

దివ్యభారతి, సిల్క్ స్మిత, ఆర్తి అగర్వాల్, ప్రత్యూష, ఫటాఫట్ జయలక్ష్మి, విలక్షణ నటుడు శ్రీహరి, హీరో ఉదయ్ కిరణ్, హాస్య నటుడు వేణుమాధవ్, యువ నటుడు యశోసాగర్, కమెడియన్ విజయ్ సాయి, ప్రేమికుల రోజు హీరో కునాల్ సింగ్, అచ్యుత్ ఇలా చాలా మంది సినీ ప్రముఖులు అర్ధాంతరంగా వారి ప్రాణాలను పోగొట్టుకొని ప్రేక్షకులకు తీరని లోటుని ఏర్పరిచారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago