Categories: FeaturedMovie News

టాలీవుడ్ హీరోలు.. వారి సినిమా వెపన్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కొక్క టైం లో ఒక టైప్ అఫ్ సినిమాలు నడుస్తూ ఉంటాయి ఒకప్పుడు పౌరాణిక సినిమాలు బాగా నడిచేవి ఆ తర్వాత కమర్షియల్ సినిమాలు ఎక్కువగా నడిచాయి ప్రస్తుతం దర్శకుడు మెప్పించాలి గాని అన్ని జొనర్ల సినిమాలని ప్రేక్షకులు చూసి ఆనందించడానికి రెడీగా ఉన్నారు.

అయితే సినిమాల్లో హీరోలకి కొన్ని కొన్ని వెపన్స్ ని వాడుతూ ఉంటారు అయితే వీటిలో హీరో ఎవరు అనేదాన్ని బట్టి కొన్ని కొన్ని వెపన్స్ ని డిజైన్ చేస్తూ ఉంటారు అలా ఏ హీరో కోసం ఏ వెపన్స్ ని డిజైన్ చేయించారో ఒకసారి మనం తెలుసుకుందాం…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి రాకముందు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు కాబట్టి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తన మొదటి సినిమాలోనే చేతులపై కార్లు పోనీచ్చుకున్నాడు.. చాతి పైన బండలని పగలగొట్టు కుంటూ తనదైన రియల్ స్టంట్స్ ని చేసి జనాలని ఆకట్టుకున్నాడు. అయితే అప్పట్లో ఇలాంటి స్టంట్స్ చేసే వారు లేకపోవడంతో అవి జనాలకి బాగా త్రిల్లింగ్ గా అనిపించాయి. అయితే పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమాలో షావలిన్ కత్తిని వాడాడు. ఆ తర్వాత ‘పంజా’ లాంటి సినిమాల్లో గన్స్ ని వాడుతూ సినిమాలు చేశాడు. అయినప్పటికీ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘జల్సా’ సినిమాలో కూడా మళ్ళీ కత్తిని వాడాడు ‘గబ్బర్ సింగ్’ సినిమా లో గన్స్ తో రౌడీలని పరిగెత్తించాడు అలా ఒక్కో సినిమాకి ఒక్కో రకంగా ఒక్కొక్క వెపన్ ని వాడుతూ వస్తున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి

తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి ఎంత పెద్ద హీరో అనేది మనందరికీ తెలిసిందే. ఆయన చేసిన ప్రతి సినిమా ఒక రికార్డు బ్రేకింగ్ గానే మిగిలిపోతుంది మొదట సినిమాల్లో చాలా వెపన్స్ ని వాడినప్పటికీ పాలిటిక్స్ లోకి వెళ్లి మళ్లీ సినిమాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా లో రాడ్ టైపు లో ఉండే ఒక వెపన్ ని డిజైన్ చేపించి ఆ సినిమాలో రౌడీలను కొట్టేందుకు దాన్ని వాడారు అది కూడా బాగా ఫేమస్ అయింది.

ఎస్ ఎస్ రాజమౌళి

ఇక్కడ మనం ఏ హీరో ఏ వెపన్ వాడాడో వాళ్ల గురించి తెలుసుకుంటున్నాం. కానీ హీరోలు కాకుండా సపరేట్ గా దర్శకుడు అయిన రాజమౌళి పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వెపన్స్ ని డిజైన్ చేయించడంలో దర్శకుడు రాజమౌళి చాలా సిద్ధహస్తుడు. ఏ హీరో కి ఏ వెపన్ వాడితే బాగుంటుందో రాజమౌళికి తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. మొదటి సినిమా నుంచి మొన్న వచ్చిన బాహుబలి దాకా ప్రతి సినిమాలో ఏదో ఒక వెపన్ ని వాడుతూ వస్తున్నాడు. అలాంటి రాజమౌళి సినిమాలకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అందుకే ఆయన సపరేట్ గా వెపన్స్ ని డిజైన్ చేపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో సింహాద్రి, చత్రపతి, విక్రమార్కుడు లో ఉండే వెపన్స్ చాలా పాపులర్ అయ్యాయి…

నందమూరి బాలకృష్ణ

బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘సమరసింహా రెడ్డి’ సినిమా లో గొడ్డలి ని వాడాడు. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో వెపన్స్ ని వాడినప్పటికీ బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ‘సింహా’ సినిమాలో ఆయన వాడిన గొడ్డలి బాగా పాపులర్ అయింది. అలాగే ‘లెజెండ్’ సినిమాలో కూడా ఒక రకమైన గొడ్డలిని వాడుతూ బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా తన గొడ్డలితో మెస్మరైజ్ చేశారు. సమరసింహా రెడ్డి సినిమా నుంచి బాలయ్య సినిమాలు చూసుకుంటే ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక వెపన్స్ ని వాడుతూ వస్తున్నారు.

అలాగే అల్లుఅర్జున్, వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ‘బద్రినాథ్’ సినిమాలో కూడా కొన్ని డిఫరెంట్ వెపన్స్ ని వాడారు ఎన్టీఆర్, మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ‘శక్తి’ సినిమాలో కూడా చాలా డిఫరెంట్ వెపన్స్ ని వాడారు…

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago