సాధారణంగా ప్రతి ఒక్కరూ తమకు ఇష్టదైవమైన రోజున ఉపవాసం ఉండటం మనం చూస్తుంటాము. అదేవిధంగా నవరాత్రి వంటి రోజులలో, శివరాత్రి వంటి పర్వదినాలలో కొందరు ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. అయితే దైవ పరంగా ఉపవాసం చేయటం వల్ల పుణ్యఫలం లభిస్తుందని భావిస్తారు. అదేవిధంగా ఉపవాసం చేయటం వల్ల కేవలం పుణ్యం మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎప్పుడో ఒకసారి ఈ విధంగా ఉపవాసం ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అదేవిధంగా మన శరీరంలో ఉండే హానికరమైన రసాయనాలను కూడా శరీరం బయటకు పంపుతుంది. అయితే ఉపవాసం చేసేటప్పుడు ఖచ్చితంగా వీటిని తీసుకోవడం వల్ల ఎంతో మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఉపవాస సమయంలో వేటిని తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
మంచినీళ్లు: ఉపవాసం చేసేవారు ఎక్కువగా మంచి నీటిని తాగడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. అదేవిధంగా మన శరీరానికి శక్తిని ఇవ్వడానికి దోహదపడుతుంది.అయితే కేవలం మంచి నీళ్లు మాత్రమే కాకుండా అందులోకి ఏవైనా పండ్ల రసాలు లేదా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
సీజనల్ ఫ్రూట్స్: ఉపవాసం అంటే మరి ఇతర ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం కాదు. మనం తీసుకునే ఆహారానికి బదులు వేరే పండ్లను, రసాలను తీసుకోవడం చేస్తుంటాము. అందుకే ఉపవాసం చేసేవారు ఆ సీజన్లో దొరికే పండ్లను తినడం ఎంతో ఉత్తమం. ఈ విధంగా పండ్లు తీసుకోవడం వల్ల ఆకలి వేయడమే కాకుండా మన శరీరానికి కావలసినంత విటమిన్లు ,ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి.
కాఫీ టీ లను తగ్గించడం: ఉపవాసం చేసే వారు లేదా వేసవికాలంలో ఎక్కువగా కాఫీ టీ లను తాగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కాఫీ టీలకు దూరంగా ఉండటం ఎంతో మంచిది. ఇందులో ఉన్నటువంటి కెఫిన్ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడతారు.
డి ఫ్రైడ్ ఆహారపదార్థాలకు దూరం: ఉపవాసం ఉండేవారు డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలను పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలను ఉపవాసం ఉన్న సమయంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం కనుక వీలైనంత వరకు ఈ విధమైనటువంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…