చాలా మంది హీరో హీరోయిన్స్ లలో పెళ్లి చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. ఇలా మన తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలు చాలామంది ఇతర భాషల వారిని పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి అయ్యాక వారందరు తెలుగు నేర్చుకున్నారు లెండి అది వేరే సంగతి.
ఇంకా కొంతమంది అయితే మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి తెలుగు నేర్చుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా మరి…
మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్. ఈమె మహారాష్ట్రలోని పూణేలో స్థిరపడ్డ గుజరాతి అమ్మాయి. మన తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సరసన బద్రి సినిమాలో మొదటి సినిమాలో నటించింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి చివరికి వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కుమారుడు, ఆధ్య అనే కుమార్తె కూడా ఉంది. అయితే పవన్, రేణు దేశాయ్ వారిద్దరూ విషయం తెలిసిందే.. ప్రస్తుతం రేను దేశాయ్ టీవీ షోలో జడ్జ్ గా పని వ్యవహరిస్తున్నారు.
ఇక నమ్రతా శిరోద్కర్.. మహేష్ బాబు భార్య. ముంబైలో స్థిరపడ్డ మరాటి అమ్మాయి. సినిమాలలోకి రాక ముందు ముందుగా ఈమె మిస్ ఇండియాగా ఎంపిక అవ్వడం జరిగింది. ఆ తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో మహేష్ తో కలిసి వంశీ చిత్రంలో నటించింది. ఆ చిత్ర సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి.. చివరకు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరికీ గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే నమ్రతా శిరోద్కర్ ఇంటి వద్దనే ఉంటూ పిల్లను చూసుకుంటూనే , అటు మహేష్ కు సంబందించిన విషయాలను ఆవిడా చూసుకుంటూ జీవితాన్ని హాయిగా గడిపేస్తుంది.
ఇక అక్కినేని అమల.. నాగార్జున రెండో భార్య.. ఈమె బెంగాలీ అమ్మాయి. నిజానికి ఈమె ఒక నాట్యకారిణి. మన తెలుగు ఇండస్ట్రీలో మొదట రామానాయుడు నిర్మాతగా వహించిన చిన్న బాబు సినిమాలో నటించింది. ఈ సినిమాలో హీరోగా నాగార్జున నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరి ఇద్దరి పరిచయం ప్రేమగా మారి చివరకు వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ అఖిల్ అనే కుమారుడు ఉన్నాడు.
ఆ తర్వాత అక్కినేని సమంత.. అక్కినేని నాగచైతన్య భార్య. సమంత మలియాలి క్రిస్టియన్. సమంత అమ్మ మళయాళీ, నాన్న తెలుగు. వీరు చెన్నై లో స్థిరపడ్డ వలన సమంతకు తమిళం, ఇంగ్లీష్ పట్టు బాగా ఉంది. సమంత తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత తెలుగు నేర్చుకుంది. ఈ తరుణంలోనే నాగ చైతన్య ను ప్రేమించి వివాహం చేసుకుని హైదరాబాదులో స్థిరపడింది.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన చిత్రాల్లో 'బాహుబలి'కి ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ…
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న అంశాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా ఒకటి. దర్శకుడు…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు…
ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకొచ్చే పదార్థాల్లో బాదం, వేరుశెనగలు తప్పకుండా ఉంటాయి. చాలా మంది ప్రతి రోజు…
తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…