Tollywood Stars:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లకు ఎంతోమంది అభిమానులు ఉంటారు ఇలా తమ అభిమాన నటీనటుల గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆత్రుత చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీల రెమ్యూనరేషన్ ఎంత వారీ ఎంతవరకు చదువుకున్నారు వారి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి ఇలాంటి విషయాలు అన్నింటి గురించి కూడా ఆరా తీస్తుంటారు. మరి మన టాలీవుడ్ హీరోలు ఎవరు ఎంతవరకు చదివారో ఇక్కడ ఓ లుక్ వేద్దాం…
సీనియర్ ఎన్టీఆర్: సీనియర్ ఎన్టీఆర్ గుంటూరులోని ఎసి కాలేజీ నుండి డిగ్రీ పట్టా పొందారు.
ఏఎన్ఆర్:
ఏఎన్ఆర్ పదో తరగతి వరకు చదువుకున్నారు.
కృష్ణ: ఏలూరు సి ఆర్ ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.
చిరంజీవి: మెగాస్టార్ వాణిజ్యశాస్త్రంలో పట్టభద్రుడుగా పట్టా పొందారు.
బాలకృష్ణ: హైదరాబాద్ నిజాం కాలేజీలో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.
నాగార్జున: నాగార్జున నాగేశ్వరరావు కొడుకుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయన మాత్రం మెకానికల్ ఇంజనీర్ చదువును పూర్తి చేసి ఇండస్ట్రీ లోకి వచ్చారు.
వెంకటేష్: ఈయన USAలోని ది మాంటెరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుండి MBA చేశారు.
పవన్ కళ్యాణ్: ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినట్టు పవన్ కళ్యాణ్ పలుమార్లు స్వయంగా వెల్లడించారు.
మహేష్ బాబు: బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.
జూనియర్ ఎన్టీఆర్: హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
ప్రభాస్: ప్రభాస్ బిటెక్ పూర్తి చేసి అనంతరం వైజాగ్ లోనే ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు.
రానా: బి.కామ్‌లో చేరిన తరువాత చెన్నై ఫిల్మ్ స్కూల్‌కి వెళ్లి అక్కడ ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో పట్టభద్రుడయ్యాడు.
అల్లు అర్జున్: అల్లు అర్జున్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA)లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నాడు.
రామ్ చరణ్: రామ్ చరణ్ లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుండి డిగ్రీ పొందాడు.
నాగచైతన్య: నాగార్జున వారసుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగచైతన్య బీకాం పూర్తి చేశారు.
నితిన్: ఈయన ఇండస్ట్రీలోకి రాకముందే బిటెక్ పూర్తి చేశారు.
రాజమౌళి:దర్శకుడుగా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ఇంటర్ ఫెయిల్ అయినప్పటికీ ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…