Krishna – Shoban Babu – Chiranjeevi : వారం రోజుల తేడాతో బాక్సాఫీస్ బరిలో దిగిన టాలీవుడ్ టాప్ హీరోలు.. ఎవరు గెలిచారో తెలుసా?

Krishna – Shoban Babu – Chiranjeevi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని సార్లు ఒకేసారి చిన్నా, పెద్ద సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్ద ఎత్తున పోటీ పడతాయి. అయితే కొన్నిసార్లు రెండు సినిమాలు విజయవంతం అయితే మరికొన్ని సార్లు ఏదో ఒక సినిమా విజయకేతనం ఎగరేస్తోంది.ఇలా బాక్సాఫీసు వద్ద ఎప్పటినుంచో స్టార్ హీరోల సినిమాలకు తీవ్రమైన పోటీ ఏర్పడింది. అయితే ఇలాంటి పోటీ 1984 లో ఏకంగా 3 పెద్ద సినిమాలు పోటీలో దిగాయి.

1984 ఆగస్టు నెలలో కేవలం వారం తేడాతో బాక్సాఫీస్ బరిలో దిగాయి.అయితే ఈ మూడు సినిమాలలో ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మూడు సినిమాలలో రెండు సినిమాలు సీనియర్ సూపర్ స్టార్స్ నటించగా మరొక సినిమా యంగ్ హీరో నటించడం విశేషం.

Krishna – Shoban Babu – Chiranjeevi:వారం రోజుల తేడాతో బాక్సాఫీస్ బరిలో దిగిన టాలీవుడ్ టాప్ హీరోలు.. గెలుపెవరిది?

ఈ మూడు సినిమాలలో ఒక సినిమా నటభూషణ శోభన్ బాబు నటించిన ఇల్లాలు ప్రియురాలు చిత్రం ఈ ఏడాది బాక్సాఫీస్ బరిలో దిగింది. ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శోభన్ బాబు సరసన సుహాసిని ప్రీతి నటించారు.ఈ సినిమాని ఆగష్టు 2వ తేదీ విడుదల చేయగా ఈ సినిమాను పెద్ద ఎత్తున మహిళా ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతున్న తరుణంలో మరో రెండు సినిమాలు పోటీకి దిగాయి.

Krishna – Shoban Babu – Chiranjeevi:వారం రోజుల తేడాతో బాక్సాఫీస్ బరిలో దిగిన టాలీవుడ్ టాప్ హీరోలు.. గెలుపెవరిది?

నట శేఖర్ కృష్ణ నటించిన బంగారు కాపురం, చిరంజీవి నటించిన ఛాలెంజ్ సినిమా. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం విశేషం. ఇక మరొక విశేషం ఏమిటంటే ఇల్లాలు ప్రియురాలు చిత్రానికి దర్శకత్వం వహించిన కోదండరామిరెడ్డి చాలెంజ్ సినిమానీ కూడా తెరకెక్కించడం విశేషం. ఇక కృష్ణ నటించిన బంగారు కాపురం చిత్రాన్ని చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

యువతను ఆకట్టుకున్న ఛాలెంజ్ సినిమా…

ఈ విధంగా ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఛాలెంజ్ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే చాలెంజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఒకే నెలలో మూడు సినిమాలు పోటీలో దిగగా శోభన్ బాబు ఇల్లాలు ప్రియురాలు, చిరంజీవి నటించిన ఛాలెంజ్ సినిమా అద్భుతమైన విజయాలను అందుకోగా కృష్ణ నటించిన బంగారు కాపురం సినిమా అబోవ్ యావరేజ్ టాక్ సంపాదించుకుంది.