ఒక్కో మెట్టూ పునాదిగా వేసుకొని చెక్కు చెదరని మెగా కోటను కట్టుకొని తన కట్టిన కోటకు తానే రాజై, మహారాజై దశాబ్దాలుగా ఆ సింహాసనాధీశులుగా వెలుగొందుతున్న ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్టార్‌డమ్ కి ఓ చేయి వేసిన స్టార్ హీరోయిన్లలో టాప్ 10గా ఎవరు నిలిచారో ఇప్పుడు తెలుసుకుందాం .
మెగాస్టార్‌తో కలిసి సరైన ఈడూ జోడూ అన్నట్టుగా నటించిన హీరోయిన్ రాధ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలను చూసినట్లయితే వీళ్లు అసలు నటిస్తున్నారన్న ఫీలింగే రానివ్వకుండా చేస్తారు. అంత గొప్పగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పండుతుందంటే నమ్మశక్యం కాదు.
ఇక చిరంజీవి ఎనర్జీకి 100శాతం సూటయ్యి, మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటి విజయశాంతి. చిరుతో దాదాపు 19సినిమాల్లో నటించి వారెవ్వా ఏమి జోడీ అనిపించుకున్నరు. ఆ తర్వాత లిస్ట్‌లో నిలిచేది కథానాయిక రాధిక. పలు సినిమాల్లో ఈమెతో నటించిన చిరు, అభిలాష చిత్రంతో మంచి గుర్తింపును సాధించుకున్నారు.
ఇకపోతే మెగాస్టార్‌కు బాగా సూటయ్యే సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన సుహాసిని కూడా అదే కోవలోకి చెందుతారు. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ చిరుతో పలు సినిమాల్లో నటించి భారీ హిట్‌లను సాధించారు. ఆ తర్వాత భానుప్రియ. సహజ నటన దాంతో పాటు క్లాసికల్ డాన్స్ కలిగిన ఆమెను, చిరు పక్కన నటించడంతో మరింత ప్రాధాన్యాన్ని తీసుకువచ్చాయి. ఇకపోతే ఇంద్ర లాంటి సక్సెల్‌పుల్ హిట్‌ను అందుకున్న సినిమాల గురించి చెప్పాలంటే సొనాలి బింద్రే కూడా చిరు విజయానికి కీలకంగా నిలిచారని చెప్పవచ్చు.
వీరే కాకుండా సుమలత, రమ్యక్రిష్ణ, సిమ్రన్ లాంటి హీరోయిన్లు చిరు అందనంత స్థాయి వెళ్లడానికి మరో కారణాలు అని కూడా చెప్పవచ్చు. ఇక నేటి కథా నాయికల్లో మెగాస్టార్ స్టైల్‌కి జోడీగా సెట్ అయ్యే హీరోయిన్ కాజల్ అగర్వాల్. దీంతో ఆయన తీస్తున్న తదుపరి చిత్రం ఆచార్యలోనూ ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…