విభిన్న సినిమాలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న నటుడు గోపీచంద్. ఆయన తీసిన చిత్రాల విషయాలకొస్తే శ్రీవాస్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా లౌక్యం. 2014లో వచ్చిన ఈ మూవీలో గోపీచంద్‌కు జోడీగా రకుల్ ప్రీతిసింగ్ నటించారు. కామెడీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, పృద్వీరాజ్, చంద్రమోహన్ కామెడీ చాలా బాగుంటుంది. గోపిచంద్ తీసిన ది బెస్ట్ మూవీస్‌లో ఇది కూడా ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పవచ్చు.
హీరోగా గోపీచంద్‌కు వరుసగా వచ్చిన సినిమాల్లో ప్రధానంగా వచ్చిన సినిమా రణం. ఆ తర్వాత చెప్పుకొదగిన ఫ్యామిలీ, ఎమోషనల్ మూవీ లక్ష్యం సినిమా కూడా మంచి విజయాన్ని తెచ్చిపెట్టాయి. వరుస విలన్ క్యారెక్టర్ల తర్వాత గోపీచంద్ హీరోగా, మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం యజ్ఞం. దీని తర్వాత ప్రేమకు, తెలుగోడి పౌరుషానికి ముడిపెడుతూ పరుచూరి మురళి తెరకెక్కించిన చిత్రం ఆంధ్రుడు. హీరోయిన్ గౌరీ పండిట్, అలాగే కె. విశ్వనాథ్ గారిన నటన తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యేలా తీశారు.
ఇలా ఆయన కెరీర్‌లో మరిన్ని సినిమాల గురించి చెప్పాలంటే జిల్, గౌతమ్ నంద, ఒక్కడున్నాడు లాంటి సినిమాలు ఎప్పుడూ టాప్ 10లోనే ఉంటాయని చెప్పవచ్చు. ఇకపోతే గోపీచంద్ తీసిన సినిమాల్లో చూడదగ్గ మరో ఇంట్రస్టింగ్ అండ్ ఎక్స్ఫరిమెంటల్ మూవీ సాహసం. మంచి సస్పెన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో హీరోయిజాన్ని పుష్కలంగా చూపించారు డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…