Featured

ఈ టాలీవుడ్ టాప్ సింగర్స్ డబ్బింగ్ చెప్పే స్టార్ యాక్టర్స్ ఎవరో తెలుసా ?

మనం సినిమా లలో చూసే హీరో హీరోయిన్ల గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. అయితే చాలామంది హీరో హీరోయిన్ అసలు వాయిస్ ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. స్టేజీల మీద మాత్రం వారు అరుదుగా మాటలు మాట్లాడుతారు. కొన్నిసార్లు వారు మాట్లాడుతూ ఉంటే వినడానికి కష్టంగా కూడా ఉంటుంది. దీనికి కారణం అనేకమంది వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన వారు కనుక. ఇలా తెలుగు సరిగా మాట్లాడలేని వాళ్ళకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక మంది డబ్బింగ్ ఆర్టిస్టులు వారి పాత్రలకు జీవం పోస్తున్నారు.

తెర వెనుక వారు ఇచ్చే వాయిస్ సినిమాలో అత్యంత కీలకమైన భాగం. హీరో హీరోయిన్స్ వారి వాయిస్ తోనే ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయాల్సి ఉంటుంది. నటీనటులు వారు తెరపై అరుస్తారు, మాట్లాడుతారు, అనేక రకాల సందర్భాల్లో వారు పని చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి వాటికి డబ్బింగ్ ఆర్టిస్టులు అనుగుణంగా వివిధ రకాలుగా మాట్లాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ ల వివరాలు ఒకసారి చూద్దామా….

ముందుగా గాన గంధర్వుడు.. టాలీవుడ్ ప్రముఖ గాయకుడు స్వర్గీయ శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పుకోవాలి… తమిళ హీరో నటుడు కమల్ హాసన్ తో పాటు మరింత కొంతమంది ఆర్టిస్టులకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పారు. ఈయన దశావతారం సినిమాలో ఏకంగా పది పాత్రల్లో ఏడు పాత్రలకు బాల సుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు. అంతే కాదు అన్నమయ్య సినిమా కి బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన వ్యక్తి ‘మనో’. ఈయన ప్రముఖ గాయకులలో ఒకరిని అందరికీ తెలిసిందే. ఈయన వివిధ నటులకు అవసరమయ్యే వివిధ సీన్స్ ను తనదైన స్టైల్ లో వెండి తెర వెనుక వాయిస్ తో ఇట్టే రక్తి కట్టించగల సామర్థ్యం కలిగిన వ్యక్తి. ఈయన తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కు దాదాపు అన్ని సినిమాలలో వాయిస్ ఓవర్ ఇస్తారు. అలాగే కొన్ని కమల్ హాసన్ సినిమాలకు కూడా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా పనిచేశారు.

ఇక వీరి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో వాయిస్ ఆర్టిస్ట్ గా, గాయకురాలిగా ఎస్. పి. శైలజ పేరు వినబడుతుంది. ఈవిడ కూడా అనేక మంది హీరోయిన్లకు తన గాత్రాన్ని ఇచ్చింది. అలనాటి మేటి హీరోయిన్ శ్రీదేవి కి కూడా ఎస్.పి.శైలజ డబ్బింగ్ వాయిస్ ను ఇచ్చింది. హీరోయిన్లకు వాయిస్ ఇవ్వడంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎస్. పి. శైలజ గారు అపారమైన ప్రజాదరణ పొందారు.

ఇక మరో డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు గాయని అయిన చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణ భారతదేశంలోని అనేకమంది హీరోయిన్లకు తన గొంతును వాయిస్ ఓవర్ గా ఇచ్చింది.
అక్కినేని సమంత కోసం అన్ని సినిమాలలో తానే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేసింది. ఏం మాయ చేసావే సినిమా కోసం ఇచ్చిన వాయిస్ కు నంది అవార్డును కూడా గెలుచుకుంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా వాయిస్ ఆర్టిస్ట్ గా ఆమె పని చేస్తోంది.

ఇక ఆ తర్వాత చెప్పుకున్నది టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత. ఈవిడ కూడా అనేక మంది హీరోయిన్లకు స్వరాన్ని చేకూర్చింది. పాటలు లోనే కాకుండా తన డబ్బింగ్ కూడా అభిమానులని గెలుచుకుంది సునీత.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అటు నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిన వ్యక్తులలో సాయి కుమార్ అతని సోదరుడు రవిశంకర్ ప్రముఖులు. వీరిద్దరు తెలుగు ప్రేక్షకులని వారి నటనతోనే కాకుండా వివిధ హీరోలకు అనేక మందికి వాయిస్ ఓవర్ ఫిలిం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. సాయి కుమార్ నటుడు డాక్టర్ రాజశేఖర్ అలాగే సుమన్ లు నటించిన అన్ని సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు. అంతే కాదు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఆయన స్వరాన్ని ఇచ్చారంటే ఆయన వాయిస్ మాడ్యులేషన్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక గొంతు తో అనేక రకాల వాయిస్ వేరియేషన్స్ ఇవ్వగల మేధాశక్తి ఆయనది. నిజానికి ఆయన వాయిస్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక సాయికుమార్ సోదరుడు రవిశంకర్ కూడా భారతీయ చలన చిత్రంలో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. రవిశంకర్ ముఖ్యంగా చిత్ర పరిశ్రమలోని ప్రతి నాయకుల వాయిస్ డబ్బింగ్ చేస్తారు. ప్రకాష్ రాజ్, సోను సూద్, ఆశిష్ విద్యార్థి, నాజర్ లాంటి మరెంతో ప్రతి కథానాయకుల వారి వాయిస్ ను ఆయన అవలీలగా గాత్రం ఇవ్వగలరు. రవిశంకర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఏకంగా నాలుగు వేలకు సినిమాలకు పైగా పని చేశారంటే నమ్మగలరా. అవును ఆయన అన్ని సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు. ఇక ఈయన తెలుగులో అరుంధతి, ప్రేమా కథ, సై, పోకిరి, అతిధి, జులాయి లాంటి సినిమాలకు ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయనకు నంది అవార్డులు వచ్చిపడ్డాయి.

అలాగే ప్రముఖ సింగర్ హేమచంద్ర కూడా అనేకమంది హీరోలకి తన గొంతుని దానం చేశాడు. ఈయన ఎక్కువగా పరభాష హీరోలకి గాత్రదానం తెలుగు సినిమాలకు చేశారు. ఈయన ధ్రువ సినిమాలో అరవింద స్వామి క్యారెక్టర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే రాజా రాణి సినిమాలో ఆర్య వాయిస్ కూడా ఇతనే ఇచ్చారు.

ఇక అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ప్రేక్షకులను తన పాటలతో, అలాగే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తూనే ఉన్న వ్యక్తి రఘు కుంచే. తను పాట తోనే కాకుండా మాటలతోనే ప్రేక్షకులని ఆకట్టుకున్న వ్యక్తి ఆయన. ఈయన పలాస 1978, 47 డేస్ లాంటి ప్రముఖ సినిమాలకు వాయిస్ అందించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెరుగులో ఉప్పు మంచిదా? చక్కెర మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!

భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…

11 hours ago

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాలకు వెళ్లితే పసిడి కథే వేరు..

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…

11 hours ago

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…

11 hours ago

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

19 hours ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

2 days ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

2 days ago