Connect with us

Featured

ఈ టాలీవుడ్ టాప్ సింగర్స్ డబ్బింగ్ చెప్పే స్టార్ యాక్టర్స్ ఎవరో తెలుసా ?

Published

on

మనం సినిమా లలో చూసే హీరో హీరోయిన్ల గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. అయితే చాలామంది హీరో హీరోయిన్ అసలు వాయిస్ ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. స్టేజీల మీద మాత్రం వారు అరుదుగా మాటలు మాట్లాడుతారు. కొన్నిసార్లు వారు మాట్లాడుతూ ఉంటే వినడానికి కష్టంగా కూడా ఉంటుంది. దీనికి కారణం అనేకమంది వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన వారు కనుక. ఇలా తెలుగు సరిగా మాట్లాడలేని వాళ్ళకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక మంది డబ్బింగ్ ఆర్టిస్టులు వారి పాత్రలకు జీవం పోస్తున్నారు.

తెర వెనుక వారు ఇచ్చే వాయిస్ సినిమాలో అత్యంత కీలకమైన భాగం. హీరో హీరోయిన్స్ వారి వాయిస్ తోనే ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయాల్సి ఉంటుంది. నటీనటులు వారు తెరపై అరుస్తారు, మాట్లాడుతారు, అనేక రకాల సందర్భాల్లో వారు పని చేయాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి వాటికి డబ్బింగ్ ఆర్టిస్టులు అనుగుణంగా వివిధ రకాలుగా మాట్లాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ ల వివరాలు ఒకసారి చూద్దామా….

ముందుగా గాన గంధర్వుడు.. టాలీవుడ్ ప్రముఖ గాయకుడు స్వర్గీయ శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పుకోవాలి… తమిళ హీరో నటుడు కమల్ హాసన్ తో పాటు మరింత కొంతమంది ఆర్టిస్టులకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పారు. ఈయన దశావతారం సినిమాలో ఏకంగా పది పాత్రల్లో ఏడు పాత్రలకు బాల సుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు. అంతే కాదు అన్నమయ్య సినిమా కి బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన వ్యక్తి ‘మనో’. ఈయన ప్రముఖ గాయకులలో ఒకరిని అందరికీ తెలిసిందే. ఈయన వివిధ నటులకు అవసరమయ్యే వివిధ సీన్స్ ను తనదైన స్టైల్ లో వెండి తెర వెనుక వాయిస్ తో ఇట్టే రక్తి కట్టించగల సామర్థ్యం కలిగిన వ్యక్తి. ఈయన తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కు దాదాపు అన్ని సినిమాలలో వాయిస్ ఓవర్ ఇస్తారు. అలాగే కొన్ని కమల్ హాసన్ సినిమాలకు కూడా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా పనిచేశారు.

ఇక వీరి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో వాయిస్ ఆర్టిస్ట్ గా, గాయకురాలిగా ఎస్. పి. శైలజ పేరు వినబడుతుంది. ఈవిడ కూడా అనేక మంది హీరోయిన్లకు తన గాత్రాన్ని ఇచ్చింది. అలనాటి మేటి హీరోయిన్ శ్రీదేవి కి కూడా ఎస్.పి.శైలజ డబ్బింగ్ వాయిస్ ను ఇచ్చింది. హీరోయిన్లకు వాయిస్ ఇవ్వడంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎస్. పి. శైలజ గారు అపారమైన ప్రజాదరణ పొందారు.

ఇక మరో డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు గాయని అయిన చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణ భారతదేశంలోని అనేకమంది హీరోయిన్లకు తన గొంతును వాయిస్ ఓవర్ గా ఇచ్చింది.
అక్కినేని సమంత కోసం అన్ని సినిమాలలో తానే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేసింది. ఏం మాయ చేసావే సినిమా కోసం ఇచ్చిన వాయిస్ కు నంది అవార్డును కూడా గెలుచుకుంది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా వాయిస్ ఆర్టిస్ట్ గా ఆమె పని చేస్తోంది.

ఇక ఆ తర్వాత చెప్పుకున్నది టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత. ఈవిడ కూడా అనేక మంది హీరోయిన్లకు స్వరాన్ని చేకూర్చింది. పాటలు లోనే కాకుండా తన డబ్బింగ్ కూడా అభిమానులని గెలుచుకుంది సునీత.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అటు నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిన వ్యక్తులలో సాయి కుమార్ అతని సోదరుడు రవిశంకర్ ప్రముఖులు. వీరిద్దరు తెలుగు ప్రేక్షకులని వారి నటనతోనే కాకుండా వివిధ హీరోలకు అనేక మందికి వాయిస్ ఓవర్ ఫిలిం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. సాయి కుమార్ నటుడు డాక్టర్ రాజశేఖర్ అలాగే సుమన్ లు నటించిన అన్ని సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు. అంతే కాదు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఆయన స్వరాన్ని ఇచ్చారంటే ఆయన వాయిస్ మాడ్యులేషన్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక గొంతు తో అనేక రకాల వాయిస్ వేరియేషన్స్ ఇవ్వగల మేధాశక్తి ఆయనది. నిజానికి ఆయన వాయిస్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక సాయికుమార్ సోదరుడు రవిశంకర్ కూడా భారతీయ చలన చిత్రంలో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. రవిశంకర్ ముఖ్యంగా చిత్ర పరిశ్రమలోని ప్రతి నాయకుల వాయిస్ డబ్బింగ్ చేస్తారు. ప్రకాష్ రాజ్, సోను సూద్, ఆశిష్ విద్యార్థి, నాజర్ లాంటి మరెంతో ప్రతి కథానాయకుల వారి వాయిస్ ను ఆయన అవలీలగా గాత్రం ఇవ్వగలరు. రవిశంకర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఏకంగా నాలుగు వేలకు సినిమాలకు పైగా పని చేశారంటే నమ్మగలరా. అవును ఆయన అన్ని సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు. ఇక ఈయన తెలుగులో అరుంధతి, ప్రేమా కథ, సై, పోకిరి, అతిధి, జులాయి లాంటి సినిమాలకు ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయనకు నంది అవార్డులు వచ్చిపడ్డాయి.

అలాగే ప్రముఖ సింగర్ హేమచంద్ర కూడా అనేకమంది హీరోలకి తన గొంతుని దానం చేశాడు. ఈయన ఎక్కువగా పరభాష హీరోలకి గాత్రదానం తెలుగు సినిమాలకు చేశారు. ఈయన ధ్రువ సినిమాలో అరవింద స్వామి క్యారెక్టర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే రాజా రాణి సినిమాలో ఆర్య వాయిస్ కూడా ఇతనే ఇచ్చారు.

ఇక అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ప్రేక్షకులను తన పాటలతో, అలాగే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తూనే ఉన్న వ్యక్తి రఘు కుంచే. తను పాట తోనే కాకుండా మాటలతోనే ప్రేక్షకులని ఆకట్టుకున్న వ్యక్తి ఆయన. ఈయన పలాస 1978, 47 డేస్ లాంటి ప్రముఖ సినిమాలకు వాయిస్ అందించారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Ramcharan: జరగండి పాట కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా.. అయినా ఫలితం లేకుండా పోయిందా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటించిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమా తర్వాత బుచ్చిబాబు అనంతరం సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్ల సినిమాలలో రామ్ చరణ్ బిజీ కాబోతున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇటీవల చరణ్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి జరగండి జరగండి అనే పాటను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రాసినటువంటి ఈ పాటను విడుదల చేయగా ఈ పాటకు అనుకున్న స్థాయిలో వ్యూస్ రాలేదని చెప్పాలి. ఈ పాట పట్ల మెగా ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

18 కోట్లు ఖర్చు..

రామ్ చరణ్ వంటి స్టార్ హీరోకి పడాల్సిన పాట కాదు అంటూ కామెంట్లో పెడుతున్నారు. ఇక ఈ పాట కోసం ఏకంగా 18 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయిలో ఖర్చు చేసిన సినిమాలోని ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Rashmika: మై డార్లింగ్.. పార్టీ కావాలంటున్న రష్మిక.. రౌడీ హీరో రిప్లై ఇదే?

Published

on

Rashmika: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే రష్మిక ఒకవైపు సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే ఈమె నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ ఈ వార్తలు గురించి మాత్రం ఈమె స్పందించడం లేదు కానీ తరచూ వీరిద్దరూ వెకేషన్ లోకి వెళ్లడం ఒకే చోటే కలిసి పార్టీలు చేసుకోవడం వంటి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ఇదిలా ఉండగా తాజాగా మై డార్లింగ్ అంటూ విజయ్ దేవరకొండను ఉద్దేశించి ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ వీడియోని రష్మిక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు.

Advertisement

ఆల్ ది బెస్ట్ మై లవ్..
మై డార్లింగ్స్ విజయ్ దేవరకొండ పరశురామ్ కు నా బెస్ట్ విషెస్. ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోయే ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీరు కచ్చితంగా హిట్ కొట్టబోతున్నారు నాకు పార్టీ కావాలి ఆల్ ద బెస్ట్ మై లవ్ మృణాల్ ఠాకూర్ అంటూ ఈ సందర్భంగా ఈమె చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Advertisement
Continue Reading

Featured

Manoj -Charan: అర్ధరాత్రి ఫోన్ చేసి 5 లక్షలు అడిగాను.. చరణ్ మంచి మనసు పై మనోజ్ కామెంట్స్!

Published

on

Manoj -Charan: మెగా పవర్ స్టార్ రాంచరణ్ మార్చ్ 27వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే . ఈ పుట్టిన రోజు సందర్భంగా ఈయన తన భార్య కూతురుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అనంతరం చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది సెలబ్రిటీలు, అభిమానులు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచు మనోజ్ రామ్ చరణ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే అంతే కాకుండా చరణ్ అంటే మనోజ్ కి చాలా అభిమానం అని పలు సందర్భాలలో తెలియజేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ రామ్ చరణ్ మంచితనం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చరణ్ ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేసిన ఎప్పుడు చెప్పుకోలేదు కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు సహాయం పొందిన వాళ్లు ఆయన మంచితనం గురించి చెబుతూ ఉంటారు.

Advertisement

ఆడబిడ్డకు సాయం..
ఈ క్రమంలోనే చరణ్ మంచితనం గురించి మనోజ్ మాట్లాడుతూ 2018 వ సంవత్సరంలో నేను అమెరికాలో ఉన్నాను. అర్ధరాత్రి సమయంలో దుబాయిలో ఓ ఆడబిడ్డ తన కుమార్తెతో కలిసి ఇమిగ్రేషన్ సమస్య కారణంగా అక్కడే చిక్కుకుపోయారు వెంటనే ఐదు లక్షలు కావాలి అని అడిగింది అప్పుడు నా దగ్గర అంత డబ్బు లేకపోవడంతో అర్ధరాత్రి చరణ్ కి ఫోన్ చేసి ఐదు లక్షల కావాలి అంటే ఎందుకు అని కూడా అడగకుండా ఐదు నిమిషాలలో పంపించారంటూ తన సహాయ గుణం పై మనోజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!