అన్నవరం లో ఉంటున్న శశికళ అనే యువతి కాలేజీ హాస్టల్ ఇంకా ఓపెన్ చేయకపోవడం వల్ల రోజు దువ్వాడ కాలేజీ కి గుంటూరు రాయగడ్ ఎక్సప్రెస్ లో ప్రయానిస్తుండగా దువ్వాడ స్టేషన్ లో దిగే సమయంలో ప్లాట్ ఫామ్ కి ట్రైన్ కి మధ్యలో ఇరుక్కుపోయింది. ఇక ఆ అమ్మాయి తండ్రి జరిగిన సంఘటనను వివరిస్తూ ట్రైన్ ఆగే సమయంలో వెనుక నుండి ట్రైన్ డోర్ తగలడం తో ఇంకా రైలు ఆగకనే అమ్మాయి కిందపడి ప్లాట్ ఫామ్ కి ట్రైన్ కి మధ్యలో ఇరుక్కుందని ఉదయాన్నే నేనే ట్రైన్ ఎక్కించానని ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదంటూ శశికళ తండ్రి బాధపడ్డారు.

శరీరం సహకరించలేదు… యూరిన్ బ్లాడర్ కట్ అయింది….
ట్రైన్ సిబ్బంది ప్లాట్ ఫామ్ ను కట్ చేసి అమ్మాయిని బయటకు తీశారు. అయితే గంట సేపు ఇరుక్కుని నరకం చూసిన అమ్మాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందింది. మరికాసేపట్లో కాలేజ్ కి వెళ్లాల్సిన అమ్మాయి ఇలా దూరమైపోతుందని అనుకోలేదుంటూ తండ్రి ఏడుస్తున్నారు. దాదాపు రెండు గంటలు నరకం అనుభవించిన శశికళ శరీరం లోపలే నుజ్జయిందని యూరిన్ బ్లాడర్ కట్ అవడంతో రక్తం బాగా పోయిందంటూ తెలిపారు.

రక్తం ఎక్కిస్తున్న శరీరంలో నిలబడలేక పోయింది కేవలం మూడు శాతం మాత్రమే రక్తం ఉంది అధికాక బీపీ పడిపోవడం తో వైద్యం చేయడానికి శశికళ శరీరం సహకరించలేదంటూ వైద్యులు తెలిపారు. ఉన్న ఒక్క బిడ్డ ఇలా వెళ్ళిపోతుందని అనుకోలేదంటూ ఆ తండ్రి కన్నీరు పెట్టుకున్నారు. మరి కొద్ది సేపటిలో కాలేజ్ లో ఉండాల్సిన తన కూతురు ఇలా అవుతుందని అనుకోలేదంటూ బాధపడ్డారు.






























