టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు ప్రత్యేక స్థానం ఉంది.. రచయిత గా తన ప్రస్థానం మొదలుపెట్టిన త్రివిక్రమ్ ఇప్పుడు టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. తాను చేసిన సినిమాల్లో ఖచ్చితంగా తనదైన మార్క్ ఉండాల్సిందే. త్రివిక్రమ్ పంచ్ లకు ఇప్పటికీ అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు అంటే అయన ప్రతి సినిమా తో ఏవిధంగా అలరిస్తారో అర్థం చేసుకోవచ్చు. తొలి చిత్రం నువ్వే నువ్వే తోనే డైరెక్టర్ గా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు త్రివిక్రమ్.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ లతో సినిమా చేసే స్థాయికి ఎదిగాడు..
అయన సినిమాల్లో ఫ్లాప్ లకంటే హిట్ లే ఎక్కువగా ఉంటాయి.. అయన గత చిత్రం అలవైకుంఠపురంలో సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. ఇంకా చెప్పాలంటే రాజమౌళి తర్వాత నెంబర్ 2 స్థానంలో ఉన్నది ఈయనే. వరస విజయాలతో దూసుకుపోతున్నాడు ఈయన పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ అంతగా తెలీదు. ముఖ్యంగా ఈయన భార్య గురించి కానీ.. ఆవిడ గురించి నిజాలు మాత్రం చాలా తక్కువ మంది తెలుసుకుని ఉంటారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సతీమణి పేరు సౌజన్య.ఈమె ఎవరో కాదు.. స్వయానా లిరిసిస్ట్ పద్మ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడి కూతురు. అందుకే సిరివెన్నెల అంటే త్రివిక్రమ్‌కు అంతటి అభిమానం. సౌజన్య కేవలం హౌజ్ వైఫ్ మాత్రమే కాదు చాలా టాలెంటెడ్. ఈమె ఒక నాట్య కళాకారిణి.2018లో ఈమె రవీంద్ర భారతిలో భరతనాట్యం డాన్స్ ప్రదర్శన ఇచ్చింది. దానికి పవన్ కళ్యాణ్ కూడా అతిథిగా వచ్చాడు. అప్పుడే తెలిసింది అందరికీ త్రివిక్రమ్ భార్యలో ఇంత గొప్ప ట్యాలెంట్ ఉందని.. 2002లో త్రివిక్రమ్, సౌజన్యల పెళ్లి జరిగింది.
ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…
వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…
రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…
ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…