TSPSC Paper leakage : రేణుక ఎవరు ఆమె బాక్గ్రౌండ్ ఏమిటి… చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన నిజాలు…: టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్

0
869

TSPSC Paper leakage : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయి. కమిషన్ ఆఫీస్ నుండే పరీక్ష పేపర్ లీక్ అవ్వడం కలకలం రేపింది. ఈ ఇష్యూ వెనుక కమిషనర్ పిఏ ప్రవీణ్, అతనితో పాటు మరో మహిళ రేణుక ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 15 మందిని తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు వారిని రిమాండ్ కు తరలించగా ప్రవీణ్ ఫోన్ లో దాదాపు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మహిళా అభ్యర్థుల న్యూడ్ ఫోటోలు వీడియో కాల్స్ రికార్డింగ్ అయి ఉన్నాయి. దాదాపు 46 మంది మహిళల న్యూడ్ వీడియోలు ఫొటోలు ప్రవీణ్ ఫోన్ లో దొరకగా పేపర్ లీక్ చేయించుకున్న అభ్యర్థులలో మమహబూబ్ నగర్ జిల్లా మన్సుర్ తండాకు చెందిన నీలేష్, రాజేందర్ అనే అభ్యర్థుల తల్లి దండ్రులు మీడియాతో మాట్లాడుతూ అసలు ఈ విషయాలేవి తెలియదని చెబుతున్నారు. అయితే ఈ కేసులో కీలకంగా మారిన రేణుక అనే మహిళ ఎవరు ఆమె బాక్గ్రౌండ్ ఏమిటి అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

రేణుక మంచి అమ్మాయి కానీ ఏమి జరిగిందో తెలియదు…

పేపర్ లీక్ లో కీలకంగా ఉన్న రేణుక మహబూబ్ నగర్ కు చెందిన మహిళ కాగా 2018 లో గురుకుల ఎస్సి బాలికల పాఠశాలలో హింది పండిట్ టీచర్ గా ఉద్యోగం సంపాదించింది. వనపర్తి జిల్లా లో హిందీ పండిట్ గా పనిచేస్తున్న రేణుక గురించి ఆమె సొంత్తూర్లో వాళ్ళు మాట్లాడుతూ ఆమె మంచిదని ఎపుడూ ఎలాంటి తప్పుడు పనులు చేయలేదని పెళ్లి చేసుకున్నాక కూడా ఎపుడూ ఆమె గురించి చెడుగా వినలేదని ఇలా ఎలా చేసిందో తెలియడం లేదంటూ చెబుతున్నారు.

ఆమెకు భర్త పిల్లలు ఉండగా తమ్ముడి కి ఏఈ పరీక్ష రాయడానికి అర్హత లేకపోయినా కూడా ప్రశ్నాపత్రం కావాలని ప్రవీణ్ తో బేరం పెట్టడం గురించి పోలీసులు గుర్తించారు. ఇక తన తాండా కే చెందిన శ్రీనివాసుల నాయక్ అనే కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుకి ప్రిపేర్ అవుతున్న అతనికి పేపర్ లీకేజ్ ఆశ చూపినా అతడు వద్దని చెప్పేసాడు. కానీ అతనికి విషయం తెలిసినా పై అధికారులకు చెప్పలేదనే ఆరోపణల మీద అతనిపైన పోలీసులు గుర్రుగా ఉన్నారు. మొత్తానికి తమ్ముడి అకౌంట్ పేరుతో సెక్రెటరీ పిఏ ప్రవీణ్ ద్వారా లక్షలలో బిజినెస్ చేసింది రేణుక రాథోడ్. ప్రస్తుతం ఆమెను ఉద్యోగం నుండి సస్పెండ్ చేసినట్లు గురుకుల వర్గాలు తెలుపుతున్నాయి.