బుల్లితెరపై యాంకర్ ప్రదీప్‌ను తెలుగువారికి ముఖ్యంగా తెలుగు టీవీ షోలను చూసేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ చురకైన పంచులతో తన మాటల్లో ఎక్కడా అశ్లీలత లేకుండా చూసుకుంటూ తెలుగులో టాప్ షోలకు వ్యాఖ్యాతగా అదరగొడుతుంటారు.
తెలుగు టీవీ తెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని బుల్లితెరపై తిరుగులేని రారాజుగా మారిపోయాడు ప్రదీప్ మాచిరాజు. ఎప్పుడూ నవ్వుతూ నవ్వించే ప్రదీప్ ఇప్పుడు తీరని దు:ఖంలోకి జారిపోయారు. ఇటీవల సినిమాల్లోనూ హీరోగా ఎంట్రీ ఇచ్చి వెండితెర, బుల్లితెరపై బిజీ అయిన ఆర్టిస్టుగా ప్రదీప్ మారాడు. త్వరలోనే కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్న వేళ అనుకోని విషాదం ఆవహించింది.
ప్రదీప్ మాచిరాజు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి పాండు రంగ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. శనివారం సాయంత్రం ప్రదీప్ తండ్రి ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మరోవైపు ప్రదీప్ కూడా కోవిడ్ బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
అలాగే ప్రదీప్ తండ్రి కోవిడ్ వల్ల చనిపోయారా లేదంటే ఇతర అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందారన్నది కూడా తెలియాల్సి ఉంది.యాంకర్‌గా బుల్లి తెరపై తిరుగులేని ప్రదీప్.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నిర్మాతలకు లాభాల్ని తెచ్చిపెట్టింది. ఆ తరవాత హీరోగా పలు అవకాశాలు వచ్చినా.. ప్రదీప్ అంగీకరించలేదు. త్వరలోనే ఓ కొత్త ప్రాజెక్టుని పట్టాలెక్కించే పనిలో ఉన్నారాయన. ఇంతలోనే.. తన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది..దీంతో ప్రదీప్ తీవ్ర దుఃఖం లోకి మునిగిపోయారు…!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…