ప్రస్తుత కాలంలో రోజురోజుకు అనేకమందిని వెంటాడుతున్న సమస్యలలో మధుమేహ సమస్య ఒకటి. మధుమేహంతో బాధపడే వారు వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చక్కెర కలిగినటువంటి ఆహార పదార్థాలను దూరం పెడుతూ చక్కెర స్థానంలో బెల్లం తీసుకుంటున్నారు.
మధుమేహంతో బాధపడేవారు చక్కెర పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా శరీర బరువు పెరగడంతోపాటు, లివర్ జబ్బులు, గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు వెంటాడుతాయి. ఈ క్రమంలోనే మధుమేహంతో బాధపడేవారు పంచదార పూర్తిగా పక్కన పెట్టి పూర్తిగా బెల్లం పై ఆధార పడుతున్నారు.
మధుమేహంతో బాధపడేవారు పంచదార కాకుండా, పంచదారకు బదులుగా కోకోనట్ షుగర్ వాడటం వల్ల వారికి ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తూ చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. ఎవరైతే మధుమేహంతో సతమతమవుతుంటారో అలాంటి వారికి కోకోనట్ షుగర్ ఎంతో ప్రయోజనకరం.
మధుమేహంతో బాధపడే వారు తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. అయితే మనం ఉపయోగించే సాధారణ పంచదారలో గ్లైసీమిక్ ఇండెక్స్ 60 నుంచి 65 శాతం ఉండటం వల్ల ఇది మధుమేహులలో మరింత తీవ్రతను కలుగజేస్తుంది. అదేవిధంగా కోకనట్ షుగర్ లో గ్లైసీమిక్ ఇండెక్స్ కేవలం 35 శాతం మాత్రమే ఉంటుంది. కనుక కోకనట్ షుగర్ తీసుకోవటం వల్ల గ్లైసిమిక్ ఇండెక్స్ మాత్రమే కాకుండా దీంట్లో ఇన్సులిన్ ఉంటుంది. ఇది మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. కనుక మధుమేహంతో బాధపడే వారు నిరభ్యంతరంగా సాధారణ చక్కెరకు బదులుగా కోకోనట్ షుగర్ తీసుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…