ప్రస్తుత కాలంలో రోజురోజుకు అనేకమందిని వెంటాడుతున్న సమస్యలలో మధుమేహ సమస్య ఒకటి. మధుమేహంతో బాధపడే వారు వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చక్కెర కలిగినటువంటి ఆహార పదార్థాలను దూరం పెడుతూ చక్కెర స్థానంలో బెల్లం తీసుకుంటున్నారు.

మధుమేహంతో బాధపడేవారు చక్కెర పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా శరీర బరువు పెరగడంతోపాటు, లివర్ జబ్బులు, గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు వెంటాడుతాయి. ఈ క్రమంలోనే మధుమేహంతో బాధపడేవారు పంచదార పూర్తిగా పక్కన పెట్టి పూర్తిగా బెల్లం పై ఆధార పడుతున్నారు.

మధుమేహంతో బాధపడేవారు పంచదార కాకుండా, పంచదారకు బదులుగా కోకోనట్ షుగర్ వాడటం వల్ల వారికి ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తూ చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. ఎవరైతే మధుమేహంతో సతమతమవుతుంటారో అలాంటి వారికి కోకోనట్ షుగర్ ఎంతో ప్రయోజనకరం.

మధుమేహంతో బాధపడే వారు తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. అయితే మనం ఉపయోగించే సాధారణ పంచదారలో గ్లైసీమిక్ ఇండెక్స్ 60 నుంచి 65 శాతం ఉండటం వల్ల ఇది మధుమేహులలో మరింత తీవ్రతను కలుగజేస్తుంది. అదేవిధంగా కోకనట్ షుగర్ లో గ్లైసీమిక్ ఇండెక్స్ కేవలం 35 శాతం మాత్రమే ఉంటుంది. కనుక కోకనట్ షుగర్ తీసుకోవటం వల్ల గ్లైసిమిక్ ఇండెక్స్ మాత్రమే కాకుండా దీంట్లో ఇన్సులిన్ ఉంటుంది. ఇది మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. కనుక మధుమేహంతో బాధపడే వారు నిరభ్యంతరంగా సాధారణ చక్కెరకు బదులుగా కోకోనట్ షుగర్ తీసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here