General News

ఐ డ్రాప్స్ అనుకోని కంట్లోకి జిగురు.. చివరికి?

కొన్ని సార్లు మన తొందరపాటు పనుల వల్ల ఎంతో పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు కంగారు కంగారుగా చేసే పనులు వారి ప్రాణాలకే ప్రమాదకరంగా మారే ఘటనలను ఎన్నో చూసాము. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి యూకేలో చోటుచేసుకుంది. యూకేకి చెందిన ఓ మహిళ కంగారుగా కంట్లో వేసుకునే చుక్కలు అని భావించి జిగురును కంటి లోపలకి వేసుకున్న ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.

యూకేకి చెందిన కేటీ బీత్ అనే 35 ఏళ్ల మహిళ జ్వరంతో బాధపడుతోంది. కళ్లు మంటగా అనిపించడం తో కళ్ళలోకి డ్రాప్స్ కోసం వెతక సాగింది. ఈ క్రమంలోనే ఆమె చేతికి ఒక బాక్స్ దొరకడంతో అది కంటిలోకి వేసుకునే చుక్కల మందు అనుకుని వేసుకుంది. ఆ తర్వాత మరి రెండు చుక్కలు ఎక్కువగా వేసుకోవడంతో ఆమె కళ్ళు అధికంగా మంటలు లేచాయి.

కళ్ళు అధికంగా మంట ఉండడంతో మహిళ ఆ డబ్బాను చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యింది. అది కంటిలోకి వేసుకునే చుక్కలు కాదు జిగురు అని తెలియడంతో వెంటనే వంటగదిలోకి పరుగులు తీసే ఆ జిగురు మొత్తం కడిగే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కళ్ళు అధికంగా మంట ఉండటంతో ఆమె బయటకు వెళ్లి ఇతరుల సహాయాన్ని కోరింది. పక్కింటి వారు విషయం తెలుసుకుని వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి మహిళను సరైన చికిత్స కోసం కేటీ హాస్పిటల్‌‌లో చేర్పించారు.

కంటిలోకి జిగురు వేసుకున్న కారణంగా ఆమె కుడికన్ను పూర్తిగా మూసుకుపోయింది. ఈ క్రమంలోనే వైద్యులు మాట్లాడుతూ ఆమె రెండు కనురెప్పలను సర్జరీ ద్వారా నెమ్మదిగా సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆమెకు చూపు వస్తుందా.. రాదా.. అనే విషయం సర్జరీ తర్వాత తెలుస్తుందని డాక్టర్లు తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ప్రసవ వేదనతో ఆవేదనాత్మక ఘటన.. ఉత్తరప్రదేశ్‌లో సంచలనం..!

ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…

5 minutes ago

రూ.75 కోట్ల ‘మండాడి’లో సుహాస్ షాకింగ్ రోల్.. రూట్ మార్చిన యంగ్ హీరో

తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్‌లో సుహాస్ ఇప్పుడు…

18 minutes ago

లవ్ ఫీలింగ్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్.. ఆ లక్కీ గర్ల్ ఎవరు?

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

28 minutes ago

‘టాక్సిక్’ టీజర్ విడుదల.. యష్ కొత్త లుక్‌పై భారీ చర్చ

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ కొత్త చిత్రం టాక్సిక్ నుంచి తాజా టీజర్ విడుదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న…

31 minutes ago

గ్రామాలకు భారీ నిధుల జల్లు.. 15వ ఆర్థిక సంఘం నుంచి తెలంగాణకు గుడ్ న్యూస్!

తెలంగాణ గ్రామాలకు కేంద్రం నుంచి మరోసారి ఆర్థిక ఊతం లభించింది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న 15వ ఆర్థిక సంఘం మూడో…

38 minutes ago

పర్ఫెక్ట్ పార్ట్‌నర్ అవసరమా? 6-7 డేటింగ్ ట్రెండ్‌తో Gen Z కొత్త ఆలోచన..!

ప్రేమ, పెళ్లి, సంబంధాలు—కాలం మారేకొద్దీ ఇవన్నీ కొత్త రూపం దాలుస్తున్నాయి. ఒకప్పుడు “పర్ఫెక్ట్ వ్యక్తి దొరకాలి” అనే ఆశ ఎక్కువగా…

44 minutes ago