ఐ డ్రాప్స్ అనుకోని కంట్లోకి జిగురు.. చివరికి?

0
228

కొన్ని సార్లు మన తొందరపాటు పనుల వల్ల ఎంతో పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు కంగారు కంగారుగా చేసే పనులు వారి ప్రాణాలకే ప్రమాదకరంగా మారే ఘటనలను ఎన్నో చూసాము. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి యూకేలో చోటుచేసుకుంది. యూకేకి చెందిన ఓ మహిళ కంగారుగా కంట్లో వేసుకునే చుక్కలు అని భావించి జిగురును కంటి లోపలకి వేసుకున్న ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.

యూకేకి చెందిన కేటీ బీత్ అనే 35 ఏళ్ల మహిళ జ్వరంతో బాధపడుతోంది. కళ్లు మంటగా అనిపించడం తో కళ్ళలోకి డ్రాప్స్ కోసం వెతక సాగింది. ఈ క్రమంలోనే ఆమె చేతికి ఒక బాక్స్ దొరకడంతో అది కంటిలోకి వేసుకునే చుక్కల మందు అనుకుని వేసుకుంది. ఆ తర్వాత మరి రెండు చుక్కలు ఎక్కువగా వేసుకోవడంతో ఆమె కళ్ళు అధికంగా మంటలు లేచాయి.

కళ్ళు అధికంగా మంట ఉండడంతో మహిళ ఆ డబ్బాను చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యింది. అది కంటిలోకి వేసుకునే చుక్కలు కాదు జిగురు అని తెలియడంతో వెంటనే వంటగదిలోకి పరుగులు తీసే ఆ జిగురు మొత్తం కడిగే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కళ్ళు అధికంగా మంట ఉండటంతో ఆమె బయటకు వెళ్లి ఇతరుల సహాయాన్ని కోరింది. పక్కింటి వారు విషయం తెలుసుకుని వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి మహిళను సరైన చికిత్స కోసం కేటీ హాస్పిటల్‌‌లో చేర్పించారు.

కంటిలోకి జిగురు వేసుకున్న కారణంగా ఆమె కుడికన్ను పూర్తిగా మూసుకుపోయింది. ఈ క్రమంలోనే వైద్యులు మాట్లాడుతూ ఆమె రెండు కనురెప్పలను సర్జరీ ద్వారా నెమ్మదిగా సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆమెకు చూపు వస్తుందా.. రాదా.. అనే విషయం సర్జరీ తర్వాత తెలుస్తుందని డాక్టర్లు తెలియజేశారు.