Unstoppable With NBK 2: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలయ్యింది. నేటి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే గత సీజన్ తో పోల్చుకుంటే ఈసారి సీజన్లో ఎంటర్టైన్మెంట్ డబల్ ఉంటుంది అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 2 కి సంబంధించిన ప్రోమో ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. అందుకు తగ్గట్టుగా మొదటి ఎపిసోడ్ కి బాలకృష్ణ వియ్యంకుడు టిడిపి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు, తనయుడు నారా లోకేష్ అతిధులుగా విచ్చేశారు.
దీంతో ఆ ఎపిసోడ్ మరింత రసవత్తరంగా మారింది. ఇకపోతే ఆ సినిమా ట్రైలర్ లో 1995లో జరిగిన విషయాల గురించి అలాగే నారా లోకేష్ స్విమ్మింగ్ పూల్ ఫోటోల గురించి బాలకృష్ణ పలు ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ అడిగిన ప్రశ్నలపై చంద్రబాబు అలాగే నారా లోకేష్ కూడా ఆసక్తికరంగానే సమాధానం ఇచ్చారు. ఇకపోతే గతంలో నారా లోకేష్ కి సంబంధించిన కొన్ని పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వరులు అయిన విషయం తెలిసిందే.
ఆ ఫోటోలలో ఉన్నారా లోకేష్ విదేశీ అమ్మాయిలతో కలిసి జలకాలు ఆడుతూ బీచ్ లో తిరుగుతూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అప్పట్లో పెద్ద సెన్సేషన్ గా నిలిచాయి. అంతేకాకుండా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రతిపక్ష నాయకులు వాటిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్ చేస్తూ చంద్రబాబు ఫ్యామిలీ పై తీవ్ర స్థాయిలో విమర్శలను గుర్తించారు. కాగా ఆ ఫోటోలపై స్పందించిన లోకేష్.. ఆ ఫోటోలో ఉన్నది నేనే. అయినా అందులో తప్పు ఏముంది.
2006లో కాలేజీ డేస్ లో సరదాగా దిగిన ఫోటోలు అవి. వారంతా నాతో పాటు నా సతీమణి బ్రహ్మణి కు కూడా కామన్ ఫ్రెండ్స్. వారితో నాకంటే బ్రహ్మణి ఎక్కువగా పరిచయం ఉంది.. ఫోటోలలో తప్పు ఏముంది అన్నది నాకైతే తెలియడం లేదు కావాలి అంటే ఆ ఫోటోలు ఫ్రేమ్ కట్టిస్తాను అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు లోకేష్. కాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 లో స్విమ్మింగ్ పూల్ ఫోటోలపై నారా లోకేష్ చేసిన వాక్యాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…