Upasana: మెగా వారసుడు రామ్ చరణ్ వారసుడి కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జరిగి పది సంవత్సరాలు పూర్తి అయినప్పటివరకు వీరు పిల్లల గురించి ఏ విషయం క్లారిటీ ఇవ్వలేదు. వీరితోపాటు పెళ్లయిన వారు, వీరి కన్నా చాలా ఆలస్యంగా పెళ్లయిన వారు కూడా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. అయినా వీళ్లు మాత్రం ఇప్పటివరకు పిల్లల గురించి ఎలాంటి ప్లానింగ్ చేయలేదు.
ఈ క్రమంలోనే తరచూ పిల్లల గురించి ఉపాసనకు ఎంతోమంది నెటిజన్లు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అయితే ఉపాసన మాత్రం తనకు సమయం వచ్చినప్పుడే సమాధానం చెబుతానని ఈ ప్రశ్నలను దాటివేశారు.ఇదిలా ఉండగా ఉపాసన సద్గురిని కలిసినప్పుడు తాను తన వైవాహిక జీవితంలో 10 సంవత్సరాల నుంచి ఎంతో సంతోషంగా ఉన్నాను కానీ అందరూ నన్ను పిల్లల గురించి ప్రశ్నిస్తున్నారు అంటూ సద్గురుని ప్రశ్నించింది.
ఈ ప్రశ్నకు సద్గురు సమాధానం చెబుతూ ప్రజెంట్ జనరేషన్లో పిల్లలు అవసరం లేదు ఒకవేళ నువ్వు ఆడపులివి అయితే పులి పిల్లని లేదా పిల్లలు గురించి ఆలోచించడం మానేయాలి అంటూ తెలిపారు.ఈ విధంగా ఎవరైతే పిల్లలను వద్దనుకుంటారో వారికి తాను ఒక గిఫ్ట్ ఇస్తానని సద్గురు తెలిపారు.అయితే ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సద్గురు ఇచ్చే గిఫ్ట్ తీసుకోవడానికి మా తాతయ్య అంగీకరించడం లేదు అంటూ చెప్పుకొచ్చారు.
సద్గురు పిల్లలు వద్దనుకున్న వారికి గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. అయితే ఆ గిఫ్ట్ తీసుకోవడానికి మెగా కుటుంబ సభ్యులు ఇష్టపడడం లేదు అంటే త్వరలోనే ఉపాసన పిల్లల విషయంలో ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. మెగా స్టార్ గ్రాండ్ చైల్డ్ కమింగ్ సూన్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఉపాసన ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…