Upasana kamineni: అపోలో హాస్పిటల్స్, రెడ్డీస్ ల్యాబ్ అధినేత ప్రతాప్ సి రెడ్డి మనవరాలు మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన కామినేని, రామ్ చరణ్ భార్యగా మెగా ఇంటి కోడలుగా ఉంటూనే అటు బిజినెస్ విమెన్ గా అపోలో హాస్పిటల్స్ బాధ్యతలతో బిజీగా ఉంటారు. ఉపాసన ఇక ఈ బాధ్యతలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఇటీవలే వృధాశ్రమాన్ని దత్తత తీసుకుని తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇక మూగ జీవాలంటే ఎంతో ఇష్టపడే ఉపాసన అంగవైకల్యం ఉన్న మూగ జీవాలను పెంచుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
కరోనా కలకలం…..
ఇక ఉపాసన తన కుటుంబాన్ని కలవడానికి ముఖ్యంగా వారి తాతయ్య ను కలవడానికి చెన్నై వెళ్లాలని అనుకున్నారు. అయితే మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా టెస్టు చేయించుకోవాలని భావించి చేయించుకున్నారు. ఇక కరోనా పాజిటివ్ రావడంతో ఆ విషయాన్నీ సోషల్ మీడియాలో ద్వారా పంచుకున్నారు.
గత వారం కరోనా బారినపడ్డాను, కరోనా వాక్సినేషన్ అవ్వడం వల్ల లక్షణాలు చాలా స్వల్పంగా మాత్రమే ఉన్నాయి . వైద్యులు పారా సిటమల్, విటమిన్ టాబ్లెట్స్ ఇచ్చారు. మొదట్లో అందరి మాటలు విని కొంత ఆందోళనకు గురయ్యాను. కరోనా సోకితే నీరసపడిపోతారని, జుట్టు ఊడిపోతుందని చెప్పారు. కానీ అలాంటివి ఏం జరగలేదు. ఇలాంటి సమయంలో శారీరకంగా, మానసికంగా చాలా ధృఢంగా ఉండడం అవసరం. కరోనా తిరిగి విజృంభిస్తుంది అని నేను కచ్చితంగా చెప్పలేను కానీ, అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. చెన్నైలోని నా కుటుంబసభ్యులను కలిసేందుకు వెళ్లాలనుకున్నాను, అందుకే కరోనా టెస్ట్ చేయించుకున్నాను అంటూ పోస్ట్ చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…