Uppena Movie: బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ తేజ్ నటి కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా వీరిద్దరి డెబ్యూ చిత్రం ఉప్పెన ద్వారా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది.
ఇలా ఈ సినిమా తెలుగులో ఎంతో మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమాని తిరిగి తమిళంలో రీమేక్ చేయడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఓ నిర్మాత ఈ సినిమా రీమేక్ ద్వారా స్టార్ హీరో విజయ్ వారసుడు సంజయ్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఈ విషయం గురించి హీరో విజయ్ తో సంప్రదింపులు కూడా చేశారని సమాచారం.
ఇకపోతే విజయ్ కుమారుడు సంజయ్ కు హీరోగా కంటే దర్శకుడిగా ఇండస్ట్రీలో స్థిరపడాలన్న కోరిక ఎక్కువగా ఉంది ఇలా దర్శకత్వంపై ఎంతో ఆసక్తి ఉన్నటువంటి సంజయ్ ఇప్పటికే విదేశాలలో దర్శకత్వం గురించి శిక్షణ కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే కోలీవుడ్ నిర్మాత మాత్రం సంజయ్ ను హీరోగా ఉప్పెన రీమేక్ సినిమా ద్వారా పరిచయం చేయాలని భావిస్తున్నారట.
ఇక ఈ రీమేక్ సినిమాలో నటి కృతి శెట్టి హీరోయిన్గా నటించబోతుందని సమాచారం. ఈమె ఇదివరకే రామ్ హీరోగా నటించిన దివారియర్ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో తిరిగి కృతి శెట్టిని తీసుకోవాలనే ఆలోచనలు ప్రొడ్యూసర్ ఉన్నట్టు సమాచారం. దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం కావాలని భావిస్తున్నటువంటి సంజయ్ ఈ సినిమా రీమేక్ చిత్రంలో నటించడానికి ఒప్పుకుంటారా లేదా అనే విషయం తెలియదు కానీ తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించి స్పష్టత రాబోతుందని తెలుస్తుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…