Vaishnavi Chaitanya: బేబీ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు యూట్యూబర్ వైష్ణవి చైతన్య. ఈమె ఎన్నో యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం పలు సినిమాలలో హీరోలకు చెల్లెలు పాత్రలో నటించి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసారు. ఈ క్రమంలోనే ఈమెకు బేబీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.
ఇలా ఈ సినిమాలో కాస్త నెగటివ్ స్టేట్స్ ఉన్న అమ్మాయి పాత్రలో నటించినప్పటికీ ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ విధంగా వైష్ణవి చైతన్య బేబీ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకొని మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఈమె మొదటిసారి అందుకున్నటువంటి రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
వైష్ణవి చైతన్య వెబ్ సిరీస్లలో నటించక ముందు పలు అవకాశాల కోసం ప్రయత్నాలు చేసే వారట. ఈ క్రమంలోనే ఈమె అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక స్టేజ్ పై డాన్స్ చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా రోజు మొత్తం ఆ వేదికపై డాన్స్ చేసినప్పటికీ తనకు 700 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని ఓ సందర్భంలో వెల్లడించారు.
ఇలా ఈ రెమ్యూనరేషన్ తక్కువ అయినప్పటికీ తనకు మాత్రం చాలా స్పెషల్ అని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చారు.ఇలా తన ఫస్ట్ రెమ్యూనరేషన్ 700 అనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక బేబీ సినిమా కోసం ఈమె ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయానికి వస్తే ఈ సినిమాకి గాను వైష్ణవి చైతన్య 10 లక్షలలోపు రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు వస్తాయని తెలుస్తుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…