Varalakshmi Sarath Kumar: కథానాయకగా, ప్రతి కథ నాయకగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ఎలా నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పోడా పోడి సినిమాతో వెండితెరకు పరిచయమైన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ తర్వాత తెలుగు తమిళ్ హిందీ కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించడమే కాకుండా లేడీ విలన్ గా కూడా నటించి మంచి గుర్తింపు పొందింది.
ఇక దీంతో లేడీ విలన్ క్యారెక్టర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇలా దశాబ్ద కాలంగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో నటిస్తూ బిజీగా ఉంటున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల ఒక భేటీలో పాల్గొనింది. ఈ క్రమంలో తన సినీ జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంతే కాకుండా తన తండ్రి వల్ల మంచి మంచి అవకాశాలు కోల్పోయానని షాకింగ్ కామెంట్స్ చేసింది.
వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ…” శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా బాయ్స్. ఆ సినిమాలో జెనీలియా పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఆ పాత్ర కోసం ఆడిషన్, స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. ఆ సినిమాలో నటించటానికి ఆసక్తిగా ఉన్న సమయంలో నాన్న అనుమతించలేదు అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా బాలాజీ శక్తి వేల్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమా లో కూడా హీరోయిన్గా నటించే అవకాశం వచ్చిందని, అయితే అప్పుడు కూడా నాన్న నిరాకరించడంతో ఆ అవకాశం కూడా చేశారు పోయిందని తెలిపింది.
మొదట చదువు ఆ తర్వాతే నటన అని నాన్న తేల్చి చెప్పడంతో ఇలా మంచి మంచి అవకాశాలు చేజారిపోయాయని వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల తెలుగులో బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో నటించి మరొకసారి తన నటనతో ప్రేక్షకులను అలరించింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…