Categories: Movie News

వరలక్ష్మీ ముందు ఏం అనకూడదో.. అదే అన్నారు.. జయమ్మ ఊరుకుంటుందా..?

వరలక్ష్మీ శరత్ కుమార్.. శరత్ బాబు కుమార్తె గా సినీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈమెకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని, క్రేజ్ ని ఏర్పరుచుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. నార్మల్ గా వారసులు అంటే ఏ హీరో గానో, హీరోయిన్ గానో చేయాలనుకుంటారు కానీ ఈమె మాత్రం భిన్నంగా విలన్ రోల్స్ చేస్తూ పైకి ఎదిగింది.. ఈమధ్య కాలంలో ఈ బొద్దు గుమ్మ కి వచ్చిన పేరు ఏ హీరోయిన్ కి రాలేదని చెప్పాలి. లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన సినిమాలో వరలక్ష్మీ కి మంచి పాత్ర లు పడడంతో పాటు ఆయా సినిమాలు కూడా సూపర్ హిట్ అవడంతో ఒక్కసారిగా ఆమె క్రేజ్ ఆకాశాన్ని అంటింది..ఆమె నటించిన రవితేజ నటించిన క్రాక్ సినిమా ఏలెవెల్లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే..

అందుకు కారణం వరలక్ష్మీ పోషించిన జయమ్మ పాత్ర కూడా ఓ కారణం.. అలాగే ఆమె నటించిన నాంది సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటిదాకా కామెడీ సినిమాలు చేస్తూ అలరించిన నరేష్ ఈ జోనర్ లోచేసి మంచి హిట్ కొట్టాడు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఇందులో లాయర్ ఆద్యగా కనిపించి తనదైన శైలి యాక్టింగ్‌తో మెప్పించింది. రీసెంట్‌గా తన 36వ పుట్టినరోజు వేడుకని జరుపుకున్న వరలక్ష్మీ.. పెళ్లి ఎప్పుడు అంటే కస్సుబుస్సులాడింది. మీడియాని కర్రొట్టుకు కొట్టినంత పని చేసింది.న 36వ పుట్టినరోజు వేడుకలను అనాథ పిల్లల సమక్షంలో జరుపుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్.

అయితే అక్కడికి మీడియా చేరుకుని.. అన్ని కుశల ప్రశ్నలు, సినిమా ప్రశ్నలు అడిగిన తర్వాత పర్సనల్ వ్యవహారాల్లోకి కూడా వెళ్లి.. పెళ్లి అన్నారట. అంతే ఆమె భగ్గున మండిందట. ఇక క్లాస్ తీసుకుంది చూడండి.. అబ్బో.. ఇది చెప్పే కంటే.. కళ్లారా చూసుంటే భలే కిక్ వచ్చేది. మైక్ పట్టుకుంటే చాలు మీకు నా పెళ్లి గురించే గుర్తుకు వస్తుందా? మహిళగా జన్మించినవారు పెళ్లి చేసుకోవాలని ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా ఏంటి? ఎప్పుడూ అదే ప్రశ్నా.. ఇంక మీకు వేరే పని ఉండదా? అంటూ కాస్త గట్టిగానే వేసుకుంది. అంతే.. దెబ్బకి మీడియా వారంత సైలెంట్ అయిపోయారు. మారు మాట్లాడలేదంటే నమ్మండి. అసలే ఫైర్ బ్రాండాయే.

TD Admin

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago